పవన్ కళ్యాణ్ సుజిత్ డైరెక్షన్‌లో డివివి ఎంటర్టైన్మెంట్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన లేటెస్ట్ మూవీ ఓజీ. ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో.. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కోసం ఇప్పటికే పవన్ అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా నిర్వహించారు టీం. ఇక ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సుజిత్ నాకు అభిమాని. జానీ మూవీ నుంచి నాతో సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాడంటూ వివరించాడు. సాహు తర్వాత సుజిత్ సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్.. నాకు అతని పరిచయం చేశాడు. తన కథని ముక్కలు ముక్కలుగా చెప్పినా.. సినిమా తీసేటప్పుడు కెపాసిటీ ఏంటో అర్థమైంది అంటూ వివరించాడు.
ఇక ఈ సినిమాకు ఇద్దరే స్టార్స్ పవన్ కళ్యాణ్ కాదు.. వాళ్ళలో మొదట క్రెడిట్ సుజిత్ దే అంటూ వివరించాడు. ఇక రెండో వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. వీళ్ళిద్దరి వర్క్ సినిమాలో నెక్స్ట్ లెవెల్ లో ఉందంటూ పవన్ ప్రశంసలు కురిపించాడు. ఇక ఈ సినిమా సందడిలో నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయా. మీరు ఊహించుకోండి డిప్యూటీ సీఎం ఇలా కత్తి పట్టుకొని వస్తే ఎవరైనా ఒప్పుకుంటారా.. సినిమా కాబట్టి సరిపోతుంది అంటూ వివరించాడు. నేను సినీ లవర్.. సినిమా చేసే టైంలో నాకు కాన్సన్ట్రేషన్ అంత సినిమా పైన ఉంటుంది. రాజకీయాలు చేసేటప్పుడు నా ఆలోచన అంతా దానిపైనే ఉంటుంది అంటూ వివరించాడు.
సుజిత్ టీం చాలా అద్భుతంగా పనిచేశారని.. ఇలాంటి టీం నేను డైరెక్షన్‌లోకి దిగినప్పుడు నాకు ఉండుంటే రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేశాడు. ట్రైలర్ పూర్తిగా సిద్ధం కాలేదంటే అసలు కుదరదని.. మా వాళ్ళకి ఈరోజు ఎంతో కొంత ట్రైలర్ చూపించాల్సిందే.. అని పట్టుపటి మరి ట్రైలర్ రిలీజ్ చేశాడు. నాకు ఫ్యాన్స్ తాపత్రయం తెలుసు.. అమితాబచ్చన్ గారి సినిమా కోసం నేను చిన్నప్పుడు ఎలా కొట్టుకునే వాడినో.. ఆయన సినిమాకి టికెట్ దొరకకపోతే చంపేయాలనిపించేది అంటూ వివరించాడు. ఓజి మూవీ అందర్నీ ఎంటర్టైన్ చేస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఫ్రీ రిలీజ్ వేడుకల్లో మూవీ టీం తో పాటు స్పెషల్ గెస్ట్ గా నిర్మాత అల్లు అరవింద్, దిల్ రాజు , వై.రవిశంకర్, రచయిత కోన వెంకటేష్ హజరయ్యి సందడి చేశారు.