టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ఫ్రాంఛైజ్ సాలిడ్ సక్సెస్ తర్వాత.. అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా లెవెల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ ఏర్పడింది. ఈ క్రమంలోనే.. ఆయన తన నెక్స్ట్ సినిమాను కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే దీన్ని అఫీషియల్ గా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. నేడు అట్లీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఐకాన్ స్టార్ ఆయనకు స్పెషల్ విషెస్ తెలియజేశారు. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ విషెస్ చేప్తూ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి.
ఇక ఈ ట్విట్లో అల్లు అర్జున్.. మై డియరెస్ట్ డైరెక్టర్ అట్లీకి నా బర్త్‌డే విషెస్.. మీపై మా ప్రేమ ఎల్లప్పుడూ ఉండాలి. ఈ స్పెషల్ డే మీకు మరింత ఆనందాన్ని, ప్రేమ, శ్రేయస్సును కలిగించాలని కోరుకుంటున్నా అంటూ రాసుకొచ్చాడు. ఇక మీ డైరెక్షన్లో రానున్న సినిమాటిక్ మ్యాజిక్ అందరూ ఆస్వాదించేంత వరకు నేను వెయిట్ చేయలేకపోతున్నా అంటూ వివరించాడు. ప్రస్తుతం ఐకాన్ స్టార్ట్ చేసిన ఈ పోస్ట్ తెగ వైరల్ గా మారుతుంది. మొదటిసారి అల్లు అర్జున్, అట్లీ కాంబో నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఆడియన్స్‌లోను మంచి హైప్ మొదలైంది.
ఈ సినిమాకు ఏఏ 22 వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు టీం. అంతేకాదు.. సినిమా షూటింగ్ కూడా మొదలై ఇటీవల ముంబై లోని షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్లో సన్ పిక్స్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం సరికొత్త టెక్నాలజీ ఉపయోగిస్తున్నామని.. డైరెక్టర్ అట్లీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చాడు. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉండనిందని.. ఆడియన్స్ కచ్చితంగా ఆకట్టుకుంటుంది అంటూ చెబుతున్నారు. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.