ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టదు.. సీనియర్ జర్నలిస్ట్ పై మంచు లక్ష్మి కంప్లైంట్..!

టాలీవుడ్‌ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు వరసరాలు.. మంచు లక్ష్మికి ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచ‌యాలు అవసరం లేదు. అందరితోను జ్యోవెల్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. సినిమాలతో పాటు.. యాంకరింగ్‌లోను స‌త్త చాటుకుంది. ఇక మంచు లక్ష్మి నార్మ‌ల్గా అందరితోనూ చాలా సరదాగా ఉంటూ న‌వ్వుతూ మాట్లాడుతుంది. ఎలాంటి విషయాన్నైనా.. తనదైన స్టైల్ లో అందరికీ సమాధానం ఇస్తుంది. అయితే ఎప్పుడు నవ్వుతూ మాట్లాడే మంచు లక్ష్మి.. ఇటీవల ఓ సీనియర్ జర్నలిస్ట్ ప్రశ్నకు ఫుల్ గా హర్ట్‌ అయింది. అతనిపై మండిపడింది.

తాజాగా మంచు లక్ష్మి.. దక్ష సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. ఓ ఇంటర్వ్యూలో సందడి చేసింది. ఇందులో జర్నలిస్ట్ కం యాంకర్ గా ఉన్న ఓ సీనియర్ వ్యక్తి .. మంచు లక్ష్మి విషయంలో పర్సనల్ క్యూస్షన్స్ సందించాడు. ఆమె వయసు, దుస్తుల విషయంలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలు మంచు లక్ష్మికి ఆగ్రహాన్ని తెప్పించాయి. ఈ వయసులో ఈ డ్రెస్సులు వేసుకోవడం ఏంటంటూ జర్నలిస్ట్ అడగడంతో.. మంచు లక్ష్మి కోపంతో ఊగిపోయింది. ఇదే ప్రశ్న ఓ పెద్ద హీరోని అడగగలవా అంటూ రివర్స్ క్యూస్షన్స్ చేసింది. దానికి ఆయన తెల్ల మొహం వేసాడు. కానీ.. మంచు లక్ష్మి మాత్రం దాన్ని అంతటితో వదల్లేదు. అతని ప్రశ్న వ్యక్తిగతంగా తనని దెబ్బతీసేలా ఉందని ఫిలిం చింబార్‌లో కంప్లైంట్ చేశారు. ఇది జర్నలిజం కాదు.. కేవలం పాపులారిటీ కోసం తమ వీడియో వైరల్ అవ్వడానికి ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటారని.. ఆమె ఆరోపణలు చేసింది.

జర్నలిస్ట్‌ల‌పై తన‌కు ఎంతో గౌరవం ఉందని.. కానీ అతను చేసింది జర్నలిజం కాదు.. కనీసం విమర్శ కూడా కాదు అంటూ రాస్కొచ్చింది. ఇక పురుషాధిపత్యం ఉన్న‌ ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు పడి నిలదొక్కుకున్న అంటూ ఫిలిం ఛాంబర్ కు చేసిన కంప్లైంట్ లో ఆమె రాసుకొచ్చింది. ఇప్పుడు నేను మౌనంగా ఉంటే భవిష్యత్తులో కూడా ఇదే ప్రవర్తనను వీళ్ళు కొనసాగిస్తారు. ఆ పేరు మోసిన జర్నలిస్టుపై.. ఫిలిం ఛాంబర్ వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.. తగిన శిక్ష వేయాలని మంచు లక్ష్మీ డిమాండ్ చేసింది. మ‌రోపక్క‌ రాష్ట్ర మహిళా కమిషన్కు ఫిర్యాదు చేయాలని కూడా డెసిషన్ తీసుకుంది. కేవలం మంచు లక్ష్మీనే కాదు.. చాలామంది స్టార్ సెలబ్రిటీస్.. ఇప్పటివరకు యూట్యూబ్ జర్నలిస్టుల తీరుపై మండిపడ్డారు. తప్పుడు కథనాలతో ఆన్లైన్లో పెట్టడమే కాదు.. ఆడియన్స్‌ను గ్రాబ్‌ చేసుకునేందుకు.. క్లిక్ బైట్స్‌ కోసం.. పిచ్చి థంబ్ నెయిల్స్‌ పెట్టి పరువు తీస్తున్నారని మండిపడుతున్నారు.