ఎస్.. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కొద్ది పేసటి క్రితం ఓ యాడ్ షూట్లో ప్రమాదం జరిగిందని.. గాయాలు అయినట్లు టాక్ నెటింట వైరల్‌గా మారుతుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. సినిమా షూట్స్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇక సినిమాలతో పాటే తారక్ అడపా దడపా యాడ్ షూట్ లలో సందడి చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రైవేట్ ఆడ్ షూట్లో పాల్గొన్నాడట.
ఇక ఈ సెట్స్ లో ప్రమాదం జరిగిందని.. ఎన్టీఆర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే ఎన్టీఆర్ అక్కడ నుంచి హాస్పిటల్ కి వెళ్ళిపోయారట. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌లో అందోళన మొదలైంది. అయితే.. తాజాగా ఎన్టీఆర్ టీం దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్ కు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని.. స్వల్ప గాయాలతో బయటపడినట్లు వివరించారు.
కేవలం రెండు వారాల రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ తారక్ సెట్స్ లో పాల్గొంటారని వివరించారు. ఇంతకీ ఏ యాడ్ షూట్‌లో తారక్‌కు ప్రమాదం జరిగింది.. అసలు తారక్‌కు ఎలా గాయాలు అయ్యాయి.. అనే విషయాలపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో డ్రాగన్ షూట్లో సందడి చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తారక్ చేతిలో మరిన్ని ప్రాజెక్ట్స్ లైన్‌లో ఉన్నాయి. ఇవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లే కావడం విశేషం.