మిరాయ్ సక్సెస్ జోష్ లో తేజ సజ్జ.. ఏకంగా మూడు బడా ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్..!

టాలీవుడ్ హీరో తేజ సజ్జా లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మిరాయ్‌తో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు బడా ప్రాజెక్టులను తేజా అఫీషియల్ గా ప్రకటించి.. ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాడు. ఇక ఆ మూడు ప్రాజెక్ట్స్ కూడా అయ‌న హిట్ సినిమాల‌కు సీక్వెల్స్ కావడం విశేషం. మెరాయ్‌ తర్వాత.. తేజ సజ్జ లైనప్ గురించి లేటెస్ట్‌గా రివీల్ చేశాడు. మిరాయ్‌ సెకండ్ పార్ట్ కోసం కొన్ని మంచి ఐడియాస్ ఉన్నాయ‌ని డైరెక్టర్ ఇప్పటికే వివ‌రి్చాడు.

ఇక హనుమాన్ సీక్వెల్ గురించి డైరెక్టర్ ప్రశాంత్‌ వర్మ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్ట్ 1కు వంద రెట్లు మించిపోయే భారీ లెవెల్‌లో.. జై హనుమాన్ ఉంటుందని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సీక్వెల్లో తను హీరో కాదని.. తేజ సజ్జా క్లారిటీ ఇచ్చాడు. సీక్వెల్‌లో తను హనుమాన్‌ పాత్రలో కనిపిస్తాన‌ని.. కానీ సినిమా హీరో ఆంజనేయ స్వామి అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. ఇక ఆంజ‌నేయ‌ పాత్ర కోసం కన్నడ స్టార్ రిషబ్ శెట్టి ఇప్పటికే సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన మొట్టమొదటి మూవీ జాంబి రేడ్డి ఎలాంటి అంచ‌నాలు లేకుండా రిలీజై మంచి సక్సెస్ అందుకుంది.

Teja Sajja Upcoming Movies List | Jai Hanuman, jaithraya, Zombie Reddy |  September 2025 Update

ఇక దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. ఇక జాంబి రెడ్డి 2 స్క్రిప్ట్ కూడా ఇప్పటికే సిద్ధమైపోయిందట. కాగా.. సినిమాకు కథను ప్రశాంత్ వర్మనే అందించినా.. డైరెక్టర్ మాత్రం మారతారు. ఇప్పటివరకు ఆ డైరెక్టర్ ఎవరో క్లారిటీ లేదు. తేజ సజ్జ నెక్స్ట్ జై హనుమాన్ ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేస్తాడని.. అదే ఏడాది చివరిలో మిరాయ్‌ సెట్స్ పైకి రావచ్చని టాక్ న‌డుస్తుంది. ఇక జాంబిరెడ్డి 2 కోసం.. మరో రెండు సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదట. అలా.. మిరాయ్‌ తర్వాత తేజ సజ్జ వరుసగా మూడు ప్రాజెక్టులను లైన్లో ఉంచుకున్నారు.