“ఫిజికల్, ఆబ్సెసివ్ నేచర్”.. సల్మాన్‌పై బిగ్ కామెంట్స్ – ఐశ్వర్యా బ్రేకప్ సీక్రెట్స్..!

బాలీవుడ్‌లో ఎన్నో ప్రేమకథలు జరిగి, ముగిసాయి. కానీ వాటిలో కొన్ని మాత్రం దశాబ్దాలు గడిచినా మళ్లీ మళ్లీ చర్చకు వస్తూనే ఉంటాయి. అలాంటి ప్రేమకథల్లో సల్మాన్‌ ఖాన్ – ఐశ్వర్యా రాయ్ లవ్‌ స్టోరీ స్పెషల్‌గా నిలుస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన ఈ ప్రేమకథ, బ్రేకప్ తర్వాత కూడా చాలా కాలం హెడ్లైన్స్‌లో నిలిచింది. తాజాగా ప్రముఖ ఫిల్మ్‌మేకర్ ప్రహ్లాద్ కాక్కర్ చేసిన కామెంట్స్‌తో ఈ కథ మరోసారి చర్చలోకి వచ్చింది. ప్రహ్లాద్ కాక్కర్ స్పష్టంగా చెప్పిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. ఆయన మాటల్లో – “సల్మాన్ చాలా ఫిజికల్, ఆబ్సెసివ్ నేచర్ ఉన్నవాడు. ఆ ప్రవర్తనను తట్టుకోలేకపోవడమే ఈ రిలేషన్ ముగింపుకు కారణమైంది” అని చెప్పారు.

Aishwarya Rai Felt 'Abandoned' By Bollywood After Salman Khan Breakup,  Claims Prahlad Kakkar | Bollywood News - News18

ఆయన ప్రకారం, ఈ లవ్ స్టోరీ 2002లో ముగిసిపోయింది. కానీ ఆ బ్రేకప్ వల్ల ఐశ్వర్యా చాలా బాధపడి ఉందని కాదు, కానీ ఇండస్ట్రీ మొత్తం సల్మాన్ వైపు నిలబడి తనను విస్మరించిందన్న భావనతో తీవ్రంగా కలత చెందిందని ఆయన తెలిపారు. “తన తప్పు కాకపోయినా అందరూ సల్మాన్‌కే మద్దతు ఇచ్చారు. అది ఐశ్వర్యాకు ద్రోహంలా అనిపించింది. అందుకే ఇండస్ట్రీపై నమ్మకం కోల్పోయింది” అని కాక్కర్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఆయన మరో ఇంట్రెస్టింగ్ విషయం బయట పెట్టారు. “నేను అదే బిల్డింగ్‌లో ఉండేవాడిని. సల్మాన్ తరచూ అక్క‌డ సీన్లు క్రియేట్ చేసేవాడు. గోడలకు తల బాదుకునేవాడు. అసలు సంబంధం చాలా కాలం క్రితమే ముగిసినా, బయటికి ఆలస్యంగా తెలిసింది. ఆ బ్రేకప్ ఐశ్వర్యా కుటుంబానికి రిలీఫ్‌లా అనిపించింది” అని ఆయన అన్నారు.

Salman Khan and Aishwarya Rai Bachchan headed for a face off! Here's how...  | Bollywood Bubble

‘హమ్ దిల్ దే చుకే సనం’ సినిమా సెట్స్‌లో మొదలైన ఈ ప్రేమకథ మూడు సంవత్సరాలపాటు సాగింది. కానీ ముగింపు మాత్రం బాగా పబ్లిక్ అయ్యింది. ఆ తర్వాత అనేక ఇంటర్వ్యూల్లో ఐశ్వర్యా “ఒకరి వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నాను” అని డైరెక్ట్‌గా చెప్పకపోయినా, అర్థమయ్యేలా వ్యాఖ్యానించింది. ఇప్పుడు ప్రహ్లాద్ కాక్కర్ చేసిన ఈ కామెంట్స్‌తో మరోసారి ఆ పాత జ్ఞాపకాలు బయటకు వచ్చాయి. సల్మాన్ – ఐశ్వర్యా రిలేషన్ ఎంత ప్యాషన్‌తో మొదలైందో, అంతే డ్రామాటిక్‌గా ముగిసిందని స్పష్టమవుతోంది. బాలీవుడ్‌లో స్టార్‌డమ్ ఎంత ఉన్నా, వ్యక్తిగత సంబంధాలు, ఇమేజ్‌లు ఎలా కెరీర్ మీద ప్రభావం చూపుతాయో ఈ లవ్ స్టోరీ ఒక పెద్ద ఉదాహరణగా మారింది.