‘ మిరాయ్ ‘కు పోటీగా కిష్కింధపురి కలెక్షన్స్.. 4 రోజుల్లో ఎంతొచ్చాయంటే..?

టాలీవుడ్ క్రేజీ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ మూవీ కిష్కింధ‌పురి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ప్రొడ్యూసర్గా వ్యవహరించిన ఈ సినిమాలో కౌశిక్ పెగళ్ల‌పాటి దర్శకుడిగా వ్య‌వ‌హించారు. చేతన్ భరద్వాజ్ మ్యూజికల్ అందించారు. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 12న గ్రాండ్ లెవెల్లో రిలీజై.. పాన్‌ ఇండియన్ సెన్సేషనల్ మూవీ మీరాయ్ కు స్ట్రాంగ్ పోటీ ఇచ్చింది. ఈ క్రమంలోనే సినిమా 4 రోజుల కలెక్షన్స్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతున్నాయి. వాస్తవానికి మిరాయ్‌కి ఉన్న క్రేజ్ రిత్యా కిష్కింధ‌పురి మంచి టాక్ దక్కించుకున్నా.. మొదటిరోజు కలెక్షన్లు మాత్రం నిరాశపరిచాయి.

అయితే మొదటి రోజు వచ్చిన మౌత్ టాక్‌తో సెకండ్ డే కలెక్షన్స్ కాస్త పుంజుకున్నాయి. మూడో రోజు నుంచి బుకింగ్స్ భారీగా పెరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్ తో హౌస్ ఫుల్ షోలను రన్ చేస్తూ మూడు రోజుల్లో నైజం, ఓవర్సీస్ లో బ్రేక్ ఏమైనా సాధించడమే కాదు.. మంచి లాభాలను కూడా దక్కించుకుంది. ఇప్పటికే ఏపీ అండ్ తెలంగాణలో దాదాపు 90 శాతం రికవరీ చేసిన కిష్కింధ‌పురి.. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోనూ లాభాల బాట పట్టనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటన నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. యాక్టింగ్ ఇరగదీసాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సినిమా కలెక్షన్ల పరంగా ఓపెనింగ్ డే రూ.2.15 కోట్ల నెట్ కలెక్షన్లు కొల్లగొట్టగా, రెండవ‌ రోజు రూ. 2.85 కోట్ల నెట్, 3వ రోజు రూ. 3.50 కోట్ల నెట్ వసూళ్ల‌ను దక్కించుకుంది.

మొత్తంగా మూడు రోజులకు ఇండియన్ నెట్ కలెక్షన్లు రూ.8.20 కోట్లు దక్కించుకుంది. ఇక ఓవర్సీస్‌లో రూ. 1.75 కోట్ల వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 3 రోజులకు కలిపి రూ.6.0 కోట్ల షేర్ దక్కించుకున్న ఈ మూవీ గ్రాస్ పరంగా రూ.10 కోట్లు సొంతం చేసుకుంది. ఇక నాలుగో రోజుకి ఓవరాల్ గా సినిమా రూ.12 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లను దక్కించుకొని మిరాయ్‌కి మంచి పోటీగా నిలిచింది. వాస్తవానికి మిరాయ్‌ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడం ఆ సినిమాకి మొదటి నుంచి క్రేజ్ ఎక్కువగా ఉన్న క్రమంలో.. కిష్కింధ‌పూరిపై కాస్త ప్రభావం పడిందనే చెప్పాలి. లేదంటే.. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ కాస్త తక్కువే. ఇక ఏదేమైనా కిష్కిందపురి ఫస్ట్ వీకెండ్‌కే చాలా చోట్ల బ్రేక్ ఈవెన్ సాధించేసింది. మరి వీక్ డేస్‌లో కూడా స్ట్రాంగ్ గా నిలబడి ఈ రేంజ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో.. లేదో.. చూడాలి. 5వ‌ రోజు నుంచి కూడా ఫుల్ ఫాల్ పెరిగితే సినిమాకు భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.