బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యున‌రేష‌న్‌… టాప్‌లేపిందెవ‌రు…?

తాజాగా టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ నయా సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికైనా 8 సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 9వ సీజన్లోకి అడుగు పెట్టింది. సెప్టెంబర్ 7 ఆదివారం బిగ్‌బాస్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో మొత్తం 15 మంది హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్ళల్లో 9 మంది సెలెబ్రెటీస్‌తో పాటు.. ఆరుగురు కామనర్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎప్పటిలానే.. హౌస్‌లో అడుగుపెట్టిన కొద్దిసేపటి నుంచి కంటెస్టెంట్ల మధ్యన గొడవలు ప్రారంభమయ్యాయి. ఒకరిపై ఒకరు మండిపడుతూ.. నామినేషన్స్‌లో పోటాపోటీగా పేర్లు చెప్పుకున్నారు.

Bigg Boss 9 Telugu Voting (Week 1) – Online, Missed Call & Hotstar Poll - StudyBizz Bigg Boss

అలా.. మొదటి వారం ఏకంగా తొమ్మిది మంది నామినేషన్స్ లో నిలువగా.. వారిలో ఇప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారని ఆసక్తి మొదలైంది. అంతేకాదు.. ఈ కొత్త సీజన్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్ లెక్కలు కూడా హాట్‌ టాపిక్‌గా మారాయి. ఈసారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ల రెమ్యున‌రేషన్లు ఎలా ఉన్నాయి..? ఎవరెంత తీసుకుంటున్నారు..? ఇక హౌస్లో అందరికంటే ఎక్కువగా ఛార్జ్‌ చేస్తున్న వ్యక్తులు ఎవరు..? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అయితే మొదట కామన్ పర్సన్స్ కేటగిరి నుంచి హౌస్ లోకి అడుగు పెట్టిన ఒక్కొక్క కంటెస్టెంట్ కు రోజుకు రూ.15వేల నుంచి 20 వేల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారట. అంటే డిమాన్, పవన్ కళ్యాణ్, శ్రీజ, మనీష్‌, ప్రియా, హరీష్ లకు ఒక్కొక్కరికి వారానికే దాదాపు రూ.70,000 మొత్తం అందనుంది.

Bharani Shankar Biography, Age, Relationship, Family, Career, Net Worth

ఇక సెలబ్రిటీలు గా అడుగుపెట్టిన వారిలో మీడియం రేంజ్ క్రేజ్ ఉన్న కంటెస్టెంట్ గా.. ఇమ్మానుయేల్ కి వారానికే రూ.2, 50000 వరకు ఇవ్వనున్నారు. శ్రీష్ఠి వర్,మా రాము రాథోడ్‌కు వారానికి రూ.2,00,000 ఇవ్వ‌నున్నార‌ట‌. ఇక టాప్‌ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన తనుజా, రీతూ చౌదరి, సుమన్ శెట్టిలకు వారానికి ఏకంగా రూ.2,75,000 అలాగే నటి ఫ్లోరా సైనికి వారానికి రూ.3 లక్షలు బిగ్బాస్ టీం ఇవ్వనుందట. ఇక హౌస్ మొత్తం లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ గా భరణి నిలిచాడు. ఇతనికి వారానికి రూ.3,50,000 లో చెప్పనున్నారట. ఈ సీజన్‌తో పోల్చుకుంటే ఈసారి రెమ్యున‌రేష‌న్‌ మరింత పెరిగిందని తెలుస్తుంది. ఇక ఈసారి సీజన్లో కంటెస్టెంట్ల మధ్య పోరు ఎలా ఉంటుందో.. చివరకు టైటిల్ ఎవరు గెలుచుకుంటారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Tech Professor (@tech_professo.1)