వాయుపుత్ర: హనుమంతుడిపై 3d యానిమేషన్ కు చందు మొండేటికి శ్రీకారం..!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చందు మొండేటి చివరగా తెర‌కెక్కించిన తండేల్‌తో బ్లాక్ బస్టర్ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. తన‌ నెక్స్ట్ సినిమాను అంతకుమించి పోయే రేంజ్ లో ప్లాన్ చేశాడట. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్యదేవర నాగ‌ వంశీ ప్రొడ్యూసర్‌గా ఈ సినిమా రూపొందనుంది. ఇక ఈ సినిమాను చరిత్ర, భక్తి, మోడల్ టెక్నాలజీ కలయికతో రూపొంద‌నుంద‌ని తెలుస్తుంది. భారీ లెవెల్‌లో త్రీడీ యానిమేషన్ టెక్నాల‌జీతో ఈ సినిమా రూపొందనుందట. ఇక వాయుపుత్ర టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.

Chandoo Mondeti - Movies, Biography, News, Age & Photos | BookMyShow

హనుమంతుడి కాలాతీత కథను గొప్ప సినిమాగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్‌ ఫిక్స్ అయ్యారు. ఇక.. ఈ సినిమా 2026 దసరా కానుకగా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని ప్లాన్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే కొద్దిసేపటి క్రితం ప్రాజెక్ట్‌ అఫీషియల్‌గా ఓ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు మేకర్స్. హనుమంతుడు కొండపై నిలబడి దహనం అవుతున్న లంకను చూస్తున్న ఒక పవర్ఫుల్ పోస్టర్ను రిలీజ్ చేశారు.

మహావతార్ నరసింహా' సక్సెస్ ఎఫెక్ట్! యానిమేషన్ మైథాలజీ మూవీస్‌పై పడిన  టాలీవుడ్.. చందూ మొండేటి దర్శకత్వంలో 'వాయుపుత్ర'... | Times Now Telugu

ఇది కేవలం సినిమా కాదు.. థియేటర్స్‌ను పవిత్రమైన దేవాలయాలుగా మార్చేసే దృశ్యంగా మారనుందని.. మునుపెన్నడూ లేని రేంజ్‌లో భక్తిపార్వస్యంలో ముంచేసేలా.. ప్రేక్షకులను ఆకట్టుకునేలా.. ఈ సినిమా డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వాయుపుత్ర ఒక సినిమాటిక్ మైల్డ్ స్టోన్‌గా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక చందు ముండేటి డైరెక్షన్‌లో ఇండియన్ ఇండస్ట్రీకి అర్థంపట్టేలా ఈ సినిమాను సిద్ధం చేయనున్నారు. హార్ట్ టచింగ్ కథాంశంతో.. అద్భుతమైన త్రీడి యానిమేషన్ విజువల్స్‌తో కలిపి ఆడియ‌న్స్‌ను పలకరించ‌నుంది. ఇక‌ ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో రిలీజ్ చేయనున్నారు.