పండంటి బిడ్డకు జన్మనిచ్చిన లావణ్య త్రిపాఠి.. పండ‌గ చేసుకుంటున్న మెగా ఫ్యాన్స్‌..!

టాలీవుడ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ లవ్లీ స్టార్ కపుల్‌లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల జంట కూడా ఒకటి. ఇక.. ఈ జంట తాజాగా అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. నేడు ఉదయం (బుధవారం) హైదరాబాద్‌లోనే ప్రముఖ రెయిన్బో హాస్పిటల్‌లో లావణ్య త్రిపాఠి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి ,బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది.

 

దీంతో ఈ జంట‌కు అందరూ విషెస్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా.. మెగా వారసుడు రావడం చిరంజీవికి మరింత ఆనందాన్ని తెచ్చి పెట్టింది. ఈ క్రమంలోనే ఈ వార్త విన్న వెంటనే చిరంజీవి ఫుల్ ఖుషి అయిపోయారట. తన కొత్త సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ ఆపేసి మరి నేరుగా హాస్పిటల్ కి వెళ్లి లావణ్య, వరుణ్ దంపతులకు విషెస్ తెలియజేశారు. ఈ క్రమంలోనే శుభవార్త తెలుసుకున్న రాంచరణ్, ఉపాసన సైతం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రస్తుతం మెగా వారసుడు ఎంట్రీ అటు మెగా కుటుంబంతో పాటు.. మెగా ఫ్యాన్స్ లోను ఆనందాన్ని కలిగించింది. ఎట్ట‌కేల‌కు మెగా వార‌సుడు వ‌చ్చాడంటూ అంతా తెగ సంబ‌రాలు చేసుకుంటున్నారు. 2023 నవంబర్‌లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇటలీలో గ్రాండ్ లెవెల్ లో వివాహం చేసుకున్నారు. ఇక ఇప్పుడు వాళ్ళిద్దరు మెగా కుటుంబానికి వారసుడిని అందించడంతో ఇరు కుటుంబాలు ఆనందంలో తేలుతున్నాయి.