టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డివంగా ఎలాంటి పాపులారిటి సంపాదించుకున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. కేవలం టాలీవుడ్ ఆడియన్సే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో ఆడియన్స్ను సైతం ఆకట్టుకున్నాడు. యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. 1989లో శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేశాడో.. సందీప్ రెడ్డివంగా అర్జున్ రెడ్డి సినిమాతో అదే రేంజ్లో ఇండస్ట్రీని షేక్ చేసి పడేసాడు. ఇక ప్రస్తుతం ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ మాట్లాడుతూ.. తన సినిమాలకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు.
రామ్ గోపాల్ వర్మ చేసిన సత్య సినిమా నేను మొత్తం 30 సార్లు చూశానని వివరించాడు. ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఇండస్ట్రీ లోకి రావాలని ఒక దృఢ సంకల్పం ఏర్పడిందని వివరించాడు. అప్పటివరకు ఓ సాధారణ ఆడియన్లా సినిమాలు చూసే వాడిని.. సత్య సినిమా చూసిన తర్వాత సినిమాలు చేయాలనే ఆలోచన మొదలైందని.. అంతేకాదు.. నేను స్టార్ట్ డైరెక్టర్ గా ఈ రేంజ్ లో ఇమేజ్ను తెచ్చుకోవడానికి సైతం ఆర్జీవి.. ‘ సత్య ‘ సినిమానే కారణమంటూ వివరించాడు. ఇక “సత్య” సినిమా లేకపోతే అర్జున్ రెడ్డి సినిమా కూడా లేదని పలు కామెంట్స్ చేశాడు.
ఏదేమైనా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్ట్రాంగ్ మాఫియాని సైతం తట్టుకొని అక్కడ కూడా సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ అందుకోవడం అంటే సాధారణ విషయం కాదు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా.. ఎన్ని రకాలుగా ట్రోల్స్ చేసిన వాటికి కృంగిపోకుండా.. స్ట్రాంగ్ కౌంటర్ తో తిప్పికొడుతున్నారు. సినిమాలు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. ఇండియాలోనే ఉన్న టాప్ డైరెక్టర్ల లిస్టులో చేరిన సందీప్.. రాజమౌళి తర్వాత మళ్లీ అంతటి గొప్ప ఇమేజ్ సంపాదించుకున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ తో చేస్తున్న స్పిరిట్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్ప్ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు.