టాలీవుడ్ యంగ్ యాక్టర్ మౌళి డెబ్యూ మూవీ లిటిల్ హార్ట్స్.. తాజాగా రిలీజై బ్లాక్ బస్టర్ సక్సెస్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పెద్ద సినిమాలను మించిపోయా రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతూ సత్త చాటుకుంటుంది. ఇక ఈ సినిమా వినోద్ ఆత్మకంగా.. ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించేలా.. సరదాగా సాగిపోయే కథ అంటూ.. ఇప్పటికే సినిమా చూసిన ఎంతోమంది తమ రివ్యూస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన పెద్ద సినిమాలను సైతం పక్కన పెట్టేసి.. లిటిల్ హార్ట్స్ సినిమా చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. ఈ సినిమాల్లో నటీనటులు, ముఖ్యంగా డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇంతకీ డైరెక్టర్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి అని సెర్చింగ్ లు కూడా సోషల్ మీడియాలో మొదలైపోయాయి.
ఈ క్రమంలోనే మూవీ డైరెక్టర్ సాయి మార్తాండ్కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెగ వైరల్ గా మారుతుంది. సాయి మార్తాండ్ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చాడని అంత అనుకుంటారు. కానీ.. ఆయన బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు. ఇంతకీ సాయి మార్తాండ్ ఎవరో చెప్పలేదు కదా.. అలనాటి దిగ్గజ డైరెక్టర్ బి వి ప్రసాద్ మనవడే. ఈ లెజెండ్రీ డైరెక్టర్ ఎన్టీఆర్ తో మేలుకొలుపు, ఆరాధన సినిమాలు కృష్ణతో చుట్టాలున్నారు జాగ్రత్త, చిరంజీవితో తాతయ్య ప్రేమ లీలలు లాంటి ఎన్నో మంచి మంచి సినిమాలను తెరకెక్కించి సక్సెస్లు అందుకున్నాడు. ఆయన తన కెరీర్ మొత్తంలో 20కి పైగా సినిమాలను తీసి ప్రేక్షకులను మెప్పించాడు.
ఇక దాదాపు 35 ఏళ్ల తర్వాత ఆయన సినీ వారసుడిగా మనవడు సాయి మార్తాండ్ మళ్లీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి టాలెంటెడ్ డైరెక్టర్ గా సత్తా చాటుకున్నాడు. లిటిల్ హార్ట్స్ తో కేవలం సక్సెస్ అందుకోవడం కాదు.. బ్లాక్ బస్టర్ గా నిలిపాడు. ఈ క్రమంలోనే సాయి మార్తాండ్పై సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తుంది. నిన్న మొన్నటి వరకు సాయి మార్తాండ్ బ్యాగ్రౌండ్ చాలా మందికి తెలియదు. కానీ ఇటీవల ఆయన బి.వి. ప్రసాద్ మనవడు అని తెలియడంతో తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు అంటూ.. తన తాత పేరు నిలబెట్టాడంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక సాయి మార్తాండ్ వాస్తవానికి మొదట నటుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని భావించాడట. కానీ ఆయన కోసం కథలు ఎవరూ రాయకపోవడంతో.. తానే కథ రాసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అలా లిటిల్ హార్ట్స్ స్టోరీ రాసిన మార్తాండ్.. అదే టైంలో మౌళి నటించిన 90స్ బయోపిక్ రిలీజ్ కావడంతో.. మౌళి అయితే కథకు పర్ఫెక్ట్ గా ఉంటాడని ఆయనకు కథ వినిపించి తాను డైరెక్టర్గా మారాడు. ఇక సాయి మార్తాండ్ టాలెంట్ కు ఫిదా అయినా ఆడియన్స్ తన ఫ్యూచర్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతున్నారు.