హౌస్ రెంట్ ఇవ్వకుండా బెదిరింపులు.. అసిస్టెంట్ డైరెక్టర్ పై ఎస్పీ చరణ్ ఫిర్యాదు..!

టాలీవుడ్ స్టార్ సింగర్ ఎస్పీ. చరణ్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎస్పీ. బాల సుబ్రహ్మణ్యం సినీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఎస్పీ చరణ్.. న‌లు సినిమాల్లో సింగర్ గా వ్యవహరిస్తూనే.. బుల్లితెరపై సింగింగ్ రియాలిటీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ఎస్పీ. చరణ్‌కు సంబంధించిన షాకింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. చర‌ణ్ తాజాగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు.

ఓ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ త‌న హౌస్‌లో రెంట్‌కు ఉన్నాడ‌ని.. ఇక ఆ రెంట్ అడిగాతే చెల్లించకపోగా.. బెదిరింపులకు పాల్పడుతున్నాడని చ‌ర‌ణ్ కేకే నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సాలిగ్రామంలో.. సత్య గార్డెన్స్ లో ఉన్న ఓ అపార్ట్మెంట్లో తనకు సొంత ఫ్లాట్ ఉందని.. అందులో తమిళ్ మూవీ ఇండస్ట్రీకి చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ తిరుజ్ఞానం అద్దెకు ఉంటున్నారంటూ వెల్లడించాడు చ‌ర‌ణ్‌.

నెలకు రూ.40, 500లు అద్దె చెల్లించడానికి అన్ని విధాలుగా ఒప్పుకొని.. ఫ్లాట్లోకి దిగిన తిరుజ్ఞానం.. అడ్వాన్స్‌గా రూ.1,50,000 మాత్రమే తనకు అందించాడని.. దాదాపు 25 నెలలుగా తిరుగుతున్నా.. ఆయ‌న‌ నుంచి ఒక్క రూపాయి కూడా అద్దె రాలేదని వివ‌రించాడు. ఇటీవల దాని గురించే గ‌ట్టిగా అడగ్గా.. నాతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డాడని చరణ్ వివరించాడు. ఆయనపై తగిన చర్యలు తీసుకుని.. అద్దె డబ్బులు నాకు తిరిగి ఇప్పించాలని.. ఇంటిని కాళీ చేయించాలని.. ఆ ఫిర్యాదులు చరణ్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం చరణ్ చేసిన ఫిర్యాదు పరిగణలోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.