ఇండస్ట్రీ ఏదైనా సరే.. చాలామంది హీరోస్ కొన్ని సందర్భాల్లో తమ వద్దకు వచ్చినా కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. ఒకసారి కథ నచ్చకపోవడం, మరోసారి కథ నచ్చిన డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడం.. ఇలా రకరకాల కారణాలతో సినిమాలకు నో చెప్పేస్తారు. కానీ.. అలాంటి కథలు కొన్ని సందర్భాల్లో బ్లాక్ బస్టర్లు గా.. మరికొన్ని సందర్భాల్లో అట్టర్ ఫ్లాప్ గా నిలుస్తాయి. అయితే సినిమా హిట్ అయినప్పుడు కథను మిస్ చేసుకున్న హీరో ఫ్యాన్స్ అబ్బా మంచి బ్లాక్ బస్టర్లు మన హీరో మిస్ అయ్యాడు అని ఫీల్ అవుతూ ఉంటారు. అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం భలే సేఫ్ అయిపోయాడు అంటూ ఆనందపడిపోతారు. అలా హమ్మయ్య.. తప్పించేసుకున్నాడే అనే సందర్భం నిన్న రిలీజ్ అయిన మదరాసి సినిమాకు అడాప్ట్ అవుతుంది.
శివ కార్తికేయన్ హీరోగా.. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా.. రిలీజ్ కు ముందు మంచి హైప్ నెలకొల్పినా.. ఫస్ట్ నుంచి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ హాఫ్ చూసి శివ కార్తికేయన్ మళ్ళీ బ్లాక్ బాస్టర్ కొట్టాడు.. ఏఆర్ మురగదాస్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వనున్నాడని.. భావించిన ఫ్యాన్స్ అందరికీ సెకండ్ హాఫ్ తీవ్రమైన డిసప్పాయింట్మెంట్ మిగిల్చిందని చెబుతున్నారు. ఇలాంటి క్రమంలోనే.. సినిమాను మొదట శివ కార్తికేయన్‌తో కాకుండా.. మరో హీరోతో తీయాలని మురుగదాస్ భావించాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఈ సినిమాను రిజెక్ట్ చేసి తప్పించుకున్న లక్కీ హీరో ఎవరో కాదు.. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
మొదట మురుగదాస్ ఈ కథ బన్నీతో చేయాలని భావించాడట. అప్పట్లో ఆయన స్క్రిప్ట్‌ను పట్టుకుని రెండు, మూడు సార్లు గీత ఆఫీస్ చుట్టూ తిరిగాడట. ఎట్టకేలకు అల్లు అర్జున్ స్క్రిప్ట్ విని సినిమాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. కానీ.. తర్వాత ఆయన కమిట్మెంట్స్తో బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే.. మురుగదాస్.. సర్కార్, దర్బార్ లాంటి సినిమాలను సైతం రిలీజ్ చేశాడు. ఇక ఈ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత బన్నీకి మదరాసి సినిమాపై ఇంట్రెస్ట్ పోయిందట. ఈ క్రమంలోనే.. అల్లు అర్జున్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఒకవేళ సినిమాలో అల్లు అర్జున్ నటించి ఉంటే.. ఆయన కెరీర్లో ఘోరమైన డిజాస్టర్ యాడ్ అయ్యేది. ఎలాగోలా దాని నుంచి బన్నీ తప్పించేసుకున్నాడంటూ ఆనంద పడిపోతున్నారు అభిమానులు.