టీమ్ ఇండియన్ మాజి స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇక రవిచంద్రన్‌కు సినిమాలంటే చాలా పిచ్చి. ఈ విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూలో వివరించాడు. కరోనా లాక్డౌన్ టైం లో ఇంట్లోనే ఉన్న తాను.. సినిమాల గురించి తన యూట్యూబ్ ఛానల్ వేదికగా రియాక్ట్ అవుతూ.. తన ఫ్యామిలీ తెలుగు సినిమాలు కూడా ఎంజాయ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. తెలుగు హీరోల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుకు నేను డై హార్ట్ ఫ్యాన్ అంటూ వివరించాడు. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా నాకు చాలా ఇష్టమంటూ చెప్పుకొచ్చిన అశ్విన్.. కరోనా మొదటి లాక్ డౌన్ టైంలో.. తెలుగు క్రికెటర్ హనుమాన్ విహారితో సరదా చిట్ చాట్ లో పాల్గొన్నాడు.
తెలుగులో మాట్లాడుకున్న ఈ ఇద్దరు ఆటగాళ్లు సినిమాల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. తమ అల్ టైం ఫేవరెట్ తెలుగు మూవీ మగధీర అని.. రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు. ఫేవరెట్ హీరో మాత్రం మహేష్ బాబు అంటూ వివరించాడు. ఇక హనుమాన్ విహారి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ కామెంట్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. మగధీర ఫేవర్ మూవీ అంటే.. మీకు రామ్ చరణ్ ఫేవరెట్ హీరోనా అని హనుమాన్ విహారి అడిగాడు. కాదని అశ్విన్ చెప్తూనే.. మహేష్ బాబు తన ఫేవరెట్ తెలుగు హీరో అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. మహేష్ బాబు చివరి మూవీ గుంటూరు కారం పై ఆయన రియాక్ట్ అవుతూ ఇటీవల ప్రశంసల వర్షం కురిపించాడు.
గతేడాది మార్చిలో తన యూట్యూబ్ షో.. ది సదరన్ ఫ్లేవర్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ సినిమా గురించి రియాక్ట్ అయ్యారు. సినిమా చాలా సరదాగా, ఎంటర్టైనింగ్ గా ఉందని.. ముఖ్యంగా కూర్చి మడత పెట్టి సాంగ్.. మహేష్ బాబు, శ్రీ లీల అద్భుతమైన డ్యాన్స్ పర్ఫామెన్స్ తో అదరగొట్టారని తెగ పొగిడేసాడు. మహేష్ బాబు అద్భుతమైన డ్యా న్సర్ అంటూ కొనియాడాడు. ఇక లాస్ట్ ఇయర్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన అశ్విన్.. తాజాగా ఐపీఎల్‌కు సైతం గుడ్ బై చెప్పేసాడు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రాంచైజీ లీగ్స్ ఆడేందుకు తను ఆ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించాడు. ఈ ఏడాది ఐపీఎల్లో అశ్విన్ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. కానీ.. ఊహించిన రేంజ్లో రిజల్ట్ టీం అందుకోలేదు.