వీరమల్లు, కింగ్డమ్ లో మెరిసిన ఈ యాక్టర్ డైరెక్టర్ అని తెలుసా.. కొడుకు టాలీవుడ్ క్రేజీ హీరో..!

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న స్టార్ సెలబ్రిటీని అంతా గుర్తుపట్టే ఉంటారు. టాలీవుడ్ లో దాదాపు పదికి పైగా సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈయన పేరు అయ్యప్ప శర్మ. తెలుగు వాడే అయినా.. ఇక్కడ కంటే కన్నడలోనే ఎక్కువ సినిమాల్లో మెరిశాడు. కెరీర్ ప్రారంభంలో డైరెక్టర్ గా వ్యవహరించిన అయ్యప్ప శర్మ.. తర్వాత పలు సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించాడు. కాగా.. అయ్యప్ప శర్మ టాలీవుడ్ ఆడియన్స్ కు దగ్గర అయింది మాత్రం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో. తెలుగు వారియర్స్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వహించిన అయ్యప్ప శర్మ.. కేజిఎఫ్‌లో య‌ష్‌కు తోడుగా నిలిచే వానరం రోల్‌లో అదరగొట్టాడు. ఈ సినిమాతో ఆయన పేరు మారుమోగిపోయింది.

Book / Hire CELEBRITY APPEARANCE Ayyappa P Sharma for Events in Best Prices  - StarClinch

తర్వాత బాలకృష్ణ అఖండలో విలన్‌గా ఆత్మ రోల్‌లో ఆడియ‌న్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాడు. నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసారత్ ఆకట్టుకున్నాడు. తర్వాత మైకెల్, శివం భ‌జే, తగ్గేదేలే, తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్బి, బాహుబలి ది కంక్లూషన్ లాంటి వరుస సినిమాల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఇక.. తాజాగా పవన్ నటించిన హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాల్లోనూ మెప్పించాడు. కాగా.. అయ్యప్ప శర్మ టాలీవుడ్ డైలాగ్ కింగ్.. సాయికుమార్‌కు చిన్న తమ్ముడన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. అలాగే.. అరుంధతి సినిమా పశుపతి క్యారెక్టర్ కు డబ్బింగ్ చెప్పిన రవిశంకర్ కూడా అయ్యప్పకు అన్న అవుతాడు. అలా.. వరస ప్రకారం టాలీవుడ్ లో క్రేజీ హీరోగా దూసుకుపోతున్న ఆది సాయికుమార్.. అయ్యప్ప శర్మకు కొడుకు అవుతాడు.

కెరియర్ పరంగా సాయికుమార్ నటించిన ఈశ్వర్ అల్లా సినిమాకు కూడా అయ్యప్ప శర్మ దర్శకుడిగా వ్య‌వ‌హ‌రించి సక్సెస్ అందుకున్నాడు. హైదరాబాద్‌లో.. మూవీ ఆర్టిసి అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్.. వైస్ ప్రెసిడెంట్ గా కొద్దికాలం పాటు విధులు నిర్వర్తించాడు. ఇక ఆది సాయి కుమార్ విషయానికి వస్తే.. సక్సెస్, ఫెయిల్యూర్‌ల‌తో సంబంధం లేకుండా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్ ద‌క్కించుకున్న.. ఓటీటీలో మాత్రం ఈయన సినిమాలు అదరగొడుతున్నాయి. తాజాగా.. షణ్ముఖ సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. అంతేకాదు.. ప్రస్తుతం ఆది చేతిలో అయిదారు ప్రాజెక్టులు ఉన్నాయి.