ఒత్తిడి భరించా.. ఎన్నోసార్లు పడుతూ లేచా.. వారసత్వం, పెళ్లి ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు.. ఉపాసన

మెగా కోడలు.. గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ భార్య ఉపాసనకు టాలీవుడ్ ఆడియ‌న్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ క్రమంలోనే తాజాగా ఉపాసన ద ఖాస్ ఆద్మీ పార్టీ పేరిట తన ఆలోచనలన్నింటినీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ప్రస్తుతం అపోస్ట్ నెటింట‌ తెగ వైరల్‌గా మారుతుంది. సంపద, హోదా, సక్సెస్, క్రేజ్ ఏది మనల్ని గొప్ప వారిని చేస్తుంది.. ఇంటర్నల్ హ్యాబిట్స్, ఎమోషన్స్ పై క్లారిటీ.. ఇతరులకు హెల్ప్ చేసే గుణం.. గొప్ప వారిని చేస్తాయా.. వీటికి ఒక్క.. సరైనా సమాధానం కూడా దొరకదు అంటూ రాసుకున్న ఆమె.. ఎవరికి వారే తమలోని సమాధానాన్ని వెతుక్కోవాలంటూ చెప్పుకొచ్చింది.

Chiranjeevi Gives Ram Charan, Upasana's Daughter a Powerful Nickname, Says  He's 'Happy and Proud' | Movies News - News18

నిన్ను నువ్వు నమ్మడం.. నిన్ను నువ్వు ప్రేమించి.. నీకంటూ నువ్వు విలువనిచ్చుకోవడం అన్నింటికంటే చాలా ముఖ్యమని.. నా అభిప్రాయం అంటూ ఆమె రాసుకొచ్చింది. సమాజం ఎప్పుడు ఆడవారికి.. వినయంతో మసులుకోవాలని చెప్తుంది. ఏదైనా మన వంతు వచ్చేవరకు ఆగాలి అంటుంది.. నిస్వార్ధంగా ఉండటమే మంచిది అని సజెస్ట్ చేస్తుంది.. పెద్ద కలలు కనడానికి అసలు ప్రోత్సహించదు.. మనం ఎద‌గ‌డానికి ఎంకరేజ్ చేయదు. అయినా.. నేను ఇప్పుడు మంచి స్థాయిలోనే ఉన్నా.. దానికి నా ఫ్యామిలీ కారణం కాదు. నా వారసత్వం, పెళ్లి ఏది కారణం కాదు.

I would lock myself up in a room and feel depressed': Upasana Konidela  opens up about overcoming difficult emotions, stress eating | Lifestyle  News - The Indian Express

ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ఎన్నో ఒత్తిడులు భరించా.. ఎంతో బాధను అనుభవించా అంటూ చెప్పుకొచ్చింది. ఎలాగైనా లైఫ్‌లో ఎదగాలని తాపత్రయంతోనే కష్టపడ్డాన‌ని.. కొన్నిసార్లు నాపై నాకే అనుమానం వచ్చేది.. కింద పడ్డ ప్రతిసారి మళ్లీ లేచి నా ప్రయాణాన్ని మొదలుపెట్టా.. నన్ను నేను నమ్మడం ప్రారంభించా.. అసలైన స్ట్రెంత్ సెల్ఫ్ రెస్పెక్ట్. దాన్ని డబ్బు, హోదా, కీర్తి లేదా ఇతర వాటితో సంబంధం ఉండదు. అహంకారం ఒక ఇమేజ్ ని కోరుతుంది.. కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ నిశ్శబ్దంగా ఇమేజ్ ను తెచ్చుకుంటుంది అంటూ ఉపాసన షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఉపాసన పోస్ట్ నెటింట‌ తెగ వైరల్‌గా మారడంతో.. ఉపాసన చాలా బాగా చెప్పింది అంటూ.. ఆమె చెప్పింది అక్షరాల సత్యమంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు.