టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వచ్చిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ 2. రీసెంట్గా భారీ అంచనాలు నడుమ రిలీజై ఫస్ట్ షో నుంచి డివైడ్ టాక్‌ను దక్కించుకుంది. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ క్రేజ్ రీత్యా ఈ సినిమా ఎలాగైనా కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంటుందని మంచి కలెక్షన్లు రాబడు1తుందని అంతా భావించారు. కానీ.. అసలు ఊహించని విధంగా ఎన్టీఆర్ కెరీర్లోనే దారుణమైన డిజాస్టర్‌గా సినిమా నిలిచింది. కనీసం సరైన ఓపెనింగ్ కూడా దక్కించుకోలేక అట్టర్ ఫ్లాప్ గా మారింది. సాధారణంగా ఎన్టీఆర్ సినిమాల టాక్ ఎలా ఉన్నా.. ఓపెనింగ్స్ మాత్రం భారీ లెవెల్లో దక్కించుకుంటాడు.
కానీ..ఈ సినిమా విషయంలో మాత్రం ఇలాంటి ఘోరమైన రిజల్ట్ రావడం అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు.. హిందీలోనూ దారుణమైన డిజాస్టర్ తెచ్చుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. డైరెక్ట్ హిందీ సినిమా కనుక.. హృతిక్ రోషన్ కూడా ప్రధానపాత్రలో నటించిన క్రమంలో.. సినిమా అక్కడైనా మంచి టాక్ తెచ్చుకుంటుందని అంతా భావించారు. ఇక వీకెండ్ వరకు సినిమా బాగానే ఆడినా.. తెలుగులో వచ్చినంత దారుణమైన ఓపెనింగ్స్ మాత్రం హిందీలో రాలేదు. కానీ.. వర్కింగ్ డేస్ లో మాత్రం సినిమా మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ వచ్చింది.
ఇక ఈ సినిమాకు పోటీగా వచ్చిన కూలి సినిమా హిందీ వర్షన్ మాత్రం కాన్స్టెంట్గా కలెక్షన్లు దక్కించుకుంటుంది. బుక్ మై షో లో ఎప్పుడు హిందీ కలెక్షన్ స్టడీ గానే ఉన్న క్రమంలో.. వార్ 2 వీకెండ్ తర్వాత కలెక్షన్లు మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ రావడం సినిమాకు మైనస్ అయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. కూలి సినిమాకు నిన్నటి వరకు రూ.2కోట్ల 70 లక్షల దక్కగా.. వార్ 2 సినిమాకు కేవలం రూ.2 కోట్ల వరకే కలెక్షన్లు వచ్చాయని చెబుతున్నారు. ఇలా.. ఓ తమిళ్ డబ్బింగ్ సినిమా డైరెక్టర్ హిందీ సినిమాను డామినేట్ చేస్తూ బాలీవుడ్ లోనే మంచి రిజల్ట్ అందుకోవడంతో.. వార్ 2 కు ఎంత దయానియా పరిస్థితి ఉందో అర్థమవుతుంది.