నిరాశపరిచినందుకు సారీ.. ఇంకా 15 ఏళ్లు టైముంది.. ట్రోలర్స్ కు నాగ వంశీ స్ట్రాంగ్ కౌంటర్..!

తెలుగు టాప్ ప్రొడ్యూసర్గా నాగ వంశీకి ఎలాంటి పరిచయాలు అవసరం లేదు. జెర్సీ సినిమా నుంచి నిన్న మొన్న వచ్చిన కింగ్డమ్ వరకు మంచి సక్సెస్ల‌తో రాణించిన నాగ వంశీ.. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలోను గ్రాండ్‌గా రిలీజైన‌ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ల వార్ 2 మూవీకి డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించాడు. అయితే.. ఊహించిన రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ కాలేదు. మూవీ రిలీజ్ కి ముందు హైదరాబాద్‌లో జరిగిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ వంశీ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయనపై ట్రోలింగ్స్ మొదలుపెట్టారు నెటిజన్స్.

వార్ 2 ఫ్లాప్ కావడంతో.. నాగవంశీ దుబాయ్ వెళ్లిపోయాడని.. సెల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది అంటూ.. అంతేకాదు సోషల్ మీడియా కూడా తను పూర్తిగా దూరంగా ఉండాలని ఫిక్స్ అయిపోయాడంటూ.. రకరకాల ట్రోలింగ్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్లపై.. నాగ వంశీ ఎక్స్ వేదికగా రియాక్ట్ అవుతూ ట్రోల‌ర్స్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తనను ట్రోల్ చేస్తున్న వాళ్లందరి విషయంలో ఆయన రియాక్ట్ అవుతూ.. ఏంటి నన్ను చాలా మిస్ అవుతున్నట్లు ఉన్నారు. వంశీ అది.. వంశీ ఇది అంటూ గ్రిపింగ్ స్టోరీస్ ఎన్నో సోషల్ మీడియాలో నా గురించి సందడి చేసేస్తున్నాయి.

పర్లేదు ఎక్స్ లో మంచి రైటర్లే ఉన్నారు. మిమ్మల్ని అందరిని నిరుత్సాహపరిచినందుకు నన్ను క్షమించండి. కానీ.. ఇంకా ఆ సమయం రాలేదు. కనీసం ఇంకో 10,15 ఏళ్ళ టైముంది. సినిమాకు దగ్గరగా.. సినిమా ధియేటర్లలో.. సినిమా కోసమే ఎప్పుడు..? మా నెక్స్ట్ మూవీ మాస్ జాతరతో త్వరలోనే కలుద్దాం అంటూ అదుర్స్ ట్విట్‌ను షేర్ చేసుకున్నాడు. దీంతో నాగ వంశీ పై వచ్చే ట్రోలింగ్స్ కు తను స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్లు అర్థమవుతుంది.