టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అఆ తో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించింది. మొదటి సినిమాతోనే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సర్వానంద్ హీరోగా శతమానం భవతి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. కెరీర్లో తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా చాలా కాలం స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. ట్రెడిషనల్ లుక్ క్యారఫ్ అడ్రస్ గా నిలిచిన అనుపమ.. ఒక్కసారిగా తన కట్టుబొట్టు, పర్ఫామెన్స్ అంతా మార్చేసి గ్లామర్ బ్యూటీగా మెరిసింది. సిద్దు జొన్నలగడ్డతో బోల్డ్ సీన్స్‌లోనూ రెచ్చిపోయింది.
ఈ క్రమంలోనే అనుపమ ఫాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ సైతం షాక్ అయ్యారు. తర్వాత చాలా కాలం గ్యాప్ ఇచ్చినా అనుపమ ప్రవీణ్ కండ్రేగుల డైరెక్షన్లో పరదా సినిమాతో ఆడియన్స్‌ను పలకరించింది. ఇక ఆగస్టు 22న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలో సందడి చేస్తుంది అనుపమప. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కెరీర్లో ఎదుర్కొన్న సమస్యల గురించి వివరించింది. ముఖ్యంగా ఓ సినిమా విషయంలో రూమర్స్ వల్ల తనకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ ఎమోషనల్ అయింది. ఇంటర్వ్యూలో భాగంగా సుక్కుమార్ డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో హీరోయిన్గా మీకు అవకాశం వచ్చిందట కదా.. మీరు రిజెక్ట్ చేశారట నిజమేనా అని ప్రశ్నించగా.. దానిపై అనుపమ రియాక్ట్ అయింది. నాకు స్టార్టింగ్ లో శతమానం భవతి తర్వాత రంగస్థలం సినిమాలో ఛాన్స్ వచ్చింది.
కానీ.. నేను ఈ సినిమా నుంచి తప్పుకోలేదు. మేకర్స్ వద్దని రిజెక్ట్ చేశారు. బయట మాత్రం చరణ్, సుకుమార్‌తో పని చేయడం ఇష్టం లేక నేను తప్పుకున్నానని.. వాళ్ళకి నచ్చినట్లుగా వాళ్ళు వార్తలు రాసేశారు. దీంతో అప్పట్లో నాకు వచ్చిన చాలా సినిమా అవకాశాలు కూడా పోయాయి. ప్రచారం నా కెరీర్‌పై చాలా ప్రభావాన్ని చూపించిందంటూ ఎమోషనల్ అయింది. ముఖ్యంగా ఇలాంటి న్యూస్ రావడం వల్ల దాదాపు ఆరు నెలలపాటు రెగ్యులర్ షూటింగ్స్ లేక.. కాల్స్ కూడా లేక ఎన్నో ఇబ్బందులు పడ్డ.. కానీ ఆ వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అసలు నా తప్పే లేదు. వాళ్ళు నన్ను హీరోయిన్గా వద్దనుకొని కాదన్నారు. కానీ.. రూమర్స్ మాత్రం నేనొద్దన్నట్లుగా స్ప్రెడ్ అయ్యాయి. ఇక ఈ వార్తల కారణంగా మానసికంగా కూడా నేను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న అంటూ చెప్పుకొచ్చింది.