మోస్ట్ పాపులర్ యాక్టర్ గా టాప్ లో ప్రభాస్.. ఫామ్ లోకి దూసుకొచ్చిన పవన్.. టాప్ 10 లిస్ట్ ఇదే..!

ప్రజెంట్‌ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. తమ డామినేషన్ తో నేషనల్ లెవెల్ కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ ఇమేజ్ను దక్కించుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పాన్ ఇండియా లెవెల్ లో ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండిబి) గత నెల జూలైలో ఇండియన్ మోస్ట్ పాపులర్ మెయిల్ యాక్టర్స్ లిస్టును సిద్ధం చేసింది. అయితే ఎప్పటిలాగే బాలీవుడ్ ఖాన్‌లను వెనక్కినెట్టి టాలీవుడ్ రెబ‌ల్ ప్రభాస్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.

Most Popular Indian Actors 🔥

అంతేకాదు.. టాలీవుడ్ టాప్ 10లో టాలీవుడ్ నుంచి ఆరుగురు హీరోలు ఉండడం అంటే ఏ రేంజ్‌లో టాలీవుడ్ హీరోలకు క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఐఎండిబి ప్రకారం జులై నెలలో ఇండియన్ మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్ట్‌లో ప్రభాస్ నెంబ‌ర్ 1గా ఉండ‌గా.. రెండో స్థానంలో తమిళ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి. 3వ‌ స్థానంలో బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ నిలిచారు. టాలీవుడ్ ఐకాన్ సార్ అల్లు అర్జున్ 4వ‌ స్థానంలో కోలీవుడ్ ఎన్టీఆర్ 5వ స్థానంలో.. సల్మాన్ ఖాన్ 6వ స్థానంలో నిలిచారు.

ఆర్‌ఆర్ఆర్‌తో గ్లోబల్ స్టార్‌గా ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న మెగా పవర్ 7, స్థానం సొంతం చేసుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు 8 వ స్థానంలో నిలిచారు. కోలీవుడ్ అజిత్ కుమార్ 9వ స్థానంలో నిలవగా.. టాప్ 10 లో నెచ్యుర‌ల్ స్టార్ నాని నిలవగా.. హరిహర వీరమల్లు రిలీజ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఫామ్‌లోకి వచ్చి.. నాని ప్లేస్ రీప్లేస్ చేసేసారు.