టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 మూవీ.. తాజాగా రాజకీయ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తాజాగా ఎన్టీఆర్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ తో నెట్టింట భారీ దుమారమే రేగింది. ఇక ఈ వివాదం పై తాజాగా సిఎం చంద్రబాబు రియాక్ట్ అయినట్లు సమాచారం. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలతో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఇబ్బందుల్లో చిక్కుకున్న నేపథ్యంలో.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే.. పార్టీ కార్యకర్తలతో మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై తారక్ అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
లీక్ అయిన ఆడియోలో.. టీడీపీకి దూరంగా ఉన్న తారక్ సినిమా చూడడంలో అర్థమేంటి అన్నట్లుగా కామెంట్లు వినిపించాయి. దీంతో తారక్ ఫ్యాన్స్‌లో ఆగ్రహం మొదలైంది. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఫ్యాన్స్ అంతా కలిసి ధర్నాకు దిగారు. లోకేష్ పేరు వస్తే.. సినిమా ఆపేయాలని కామెంట్స్ ఆడియోలో వినిపించడం మరింత వివాదానికి దారితీసింది. అనంతపురంలో మొదలైన ఈ ధర్నా క్రమక్రమంగా రాయలసీమ నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో దాదాపు అన్నిజిల్లాల్లోనూ వ్యాపించి పెద్ద దుమారంగా మారిపోయింది. ప్రతి ప్రాంతంలోనూ తారక్ ఫ్యాన్స్.. ఆ ఎమ్మెల్యే ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు.
ఈ క్రమంలోనే టీడీపీ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తాజాగా రియాక్ట్ అయినట్లు సమాచారం. పార్టీ నేతల నిర్లక్ష్య వ్యాఖ్యలు.. వ్యక్తిగత అహంకారాలు.. వర్గ పోరాటాలు.. టీడీపీ ప్రతిష్టను దెబ్బతీయకూడదని ఆయన వార్నింగ్ ఇచ్చారట. ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్లేలా అసలు ప్రవర్తించకూడదని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక తనపై వచ్చినవని ఆరోపణలన్ని.. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఖండించాడు. ఆడియో ఫేక్ అని లీక్ అయినా ఆడియో తనది కాదంటూ చెప్పుకొచ్చాడు. రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు ఇలాంటి కుట్రలు జరుగుతున్నాయని.. నేనెప్పుడూ నందమూరి, నారా కుటుంబాల అభిమాని అంటూ వివరించాడు. అలాంటి మాటలు చెప్పడం అసంభవం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలని జిల్లా ఎస్పీని ఆయన కోరినట్లు వివరించాడు. ప్రస్తుతం ఈ వివాదం నెటింట వైరల్‌గా మారుతుంది.