ఇటీవల జరిగిన ఆపరేషన్ సింధూర్‌లో ఎంతోమంది జవాన్లు వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలుగు జవాన్ మురళి నాయక్ కూడా ఒకడు. ఇక త్వరలోనే ఈ బయోపిక్ పాన్ ఇండియా లెవెల్లో రూపొందించనున్ననట్లు కొద్ది నిమిషాల క్రితం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసే అఫీషియల్ గా ప్రకటించారు. ఈ ప్రెస్మీట్లో హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ.. జై భారత్.. జై మురళి నాయక్. ఇది కేవలం ఒక సినిమా మాత్రం కాదు.. ఒక రియల్ హీరో స్టోరీ.. ఇలాంటి కథలు చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటివరకు ఒక తెలుగు సైనికుడు మీద బయోపిక్ వచ్చిందే లేదు. తెలుగు సైనికుల మీద వస్తున్న మొట్టమొదటి బయోపిక్ సినిమాని.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది.
మాకు అవకాశం దొరికితే సినిమాను ఇంటర్నేషనల్ లెవెల్ లో రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం అంటూ వివరించాడు. మురళి గారి కథ ప్రపంచానికి తెలియజేయాలని మేము అనుకున్నాం. ఆపరేషన్ సింధూర్ మన దేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యయనం. అలాంటి వార్‌లో పాల్గొని విరమణం పొందిన మురళి నాయక్ కథ ప్రపంచానికి తెలియజెప్పాలి.. ఇంత పవర్ఫుల్ సబ్జెక్ట్ దేశానికి చెప్పే అవకాశం రావడం నా అదృష్టం. మురళి గారి పేరెంట్స్‌కు విషయం చెప్పగానే వారు ఏమీ ఆలోచించకుండా ఖచ్చితంగా ఈ కథను మీరు చేయండి అన్నారు. మాకు ఎలాంటి ఆశలు లేవని.. మా అబ్బాయి జీవితానికి ఉన్నది ఉన్నట్లుగా చూపించండి చాలు.. ఈ దేశానికి తనని పరిచయం చేయండి అన్నారని వివరించాడు.
ఇక ప్రస్తుతం మాకు మురళి గురించి తెలిసింది ఒక్క శౄతమే. ఆయన కథను చెబుతుంటే నాకు కన్నిరు ఆగలేదు అంటూ గౌతం చెప్పుకొచ్చాడు. అలాంటి గ్రేట్ స్టోరీని ప్రెజెంట్ చేయాలని మేము భావిస్తున్నాం. దానికి మీ అందరి సపోర్ట్ కావాలంటూ చెప్పుకొచ్చాడు. ఇది ఒక సాధారణ సబ్జెక్టు కాదు. ఒక రియల్ హీరో సినిమా అని.. గ్రౌండ్ స్కేల్లో తీయడానికి ముఖ్య కారణం నిర్మాత కే. సురేష్ బాబు గారు. ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చాడు. మురళి నాయక్ గారి పేరెంట్స్‌కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇది కేవలం సినిమా కాదు దేశం గర్వపడే ఒక ఎమోషన్ అంటూ వివరించాడు. ఇక ప్రొడ్యూసర్ కే సురేష్ బాబు మాట్లాడుతూ.. ఇది సినిమా అనడం కంటే ఓ ఎమోషన్ అనాలి. మురళి నాయక్ జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర జవాన్ కథ.. అందరూ గర్వపడేలా ఈ సినిమా ఉండనుంది.. మురళి నాయక్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించడానికి మేము ప్రయత్నాలు మొదలుపెట్టాం. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా నిర్మించనున్న అంటూ వివరించాడు. ఇక మురళి నాయక్ తండ్రి ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. భారత్ మాతాకీ జై.. మురళి ఆపరేషన్ సింధూర్‌లో ఎంతో వీరోచితంగా పోరాడాడు. గౌతమ్ బాబు.. మురళి గురించి మంచి సినిమా తీయండి. భారతీయులందరి గుండెల్లో అది ఎప్పటికీ నిలిచిపోవాలంటూ చెప్పుకొచ్చాడు.
ఈ సినిమా తీయడానికి మురళి నాయక్ తల్లిదండ్రులుగా మేము అంగీకరిస్తున్నామని.. మురళి పాత్రలో గౌతం బాబుని చూడాలని మురళి తల్లిదండ్రులుగా మేము సంతోషిస్తున్నాం.. ఈ సినిమా పెద్ద సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను.. జైహింద్ అంటూ కామెంట్స్ చేశాడు. మురళి నాయక్ తల్లి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మురళి ఆర్మీలో జాయిన్ కావాలని ఎన్నో కలలు కన్నాడు. భారతదేశానికి సేవ చేయాలని వెళ్ళాడు. అక్కడే చచ్చిన బ్రతికిన అనుకున్నాడు. తల్లిదండ్రులుగా మేము కూడా మా సపోర్ట్ ఇచ్చాం. గౌతం కూడా నాకు కొడుకు లాంటివాడే. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా అంటూ మురళి నాయక్ తల్లి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.