గత నాలుగు రోజుల క్రితం.. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ క్లాష్ ఎదురైన సంగతి తెలిసిందే. గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించిన వార్ 2, కూలి సినిమాల మధ్యన గట్టి పోటీ నెలకొంది. భారీ అంచనాలతో ఒకేసారి రిలీజ్ అయిన ఈ సినిమాలు.. ఓపెనింగ్స్ లోను జోరు చూపించాయి. ఇక రెండు సినిమాలు డబ్బింగ్ సినిమాలే అయినా.. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలపై మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలోనే.. తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఇంట్రెస్టింగ్ నెంబర్స్ అందుకుంటున్నాయి.
అయితే తెలుగు రాష్ట్రాల్లో కూలీ డామినేషన్ ఎక్కువగా ఉందని.. అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీకి కంచుకోట అయిన.. నైజాం మార్కెట్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాకు మించి.. డామినేషన్ కూలీ ఇస్తుండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే రెండు రోజుల వసూళ్లలో వార్ 2 కంటే రజనీకాంత్ కూలి సినిమానే ఎక్కువ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇక.. డే 3లోను ఇదే ఫీట్‌ను కూలి సాధించింది.
నైజం మార్కెట్లో మూడవ రోజు లెక్కల ప్రకారం.. రూ.2.65 కోట్ల షేర్ వసూళను కూలి దక్కించుకుందని సమాచారం. ఇక వార్ 2 అయితే.. కేవలం రూ.1.65 కోట్ల షేర్ వసూళ్లని మాత్రమే దక్కించుకుందట. అంటే.. కూలి కంటే కోటి రూపాయలు ఏకంగా తక్కువ కలెక్షన్లను అందుకుందని పిఆర్ లెక్కలు వెల్లడించాయి. ఇలా.. నైజాంలో కూలి ఊచకోత మోగిపోతుంది. ఇదే రేంజ్ లో కూలీ డామినేషన్ కొనసాగితే.. కచ్చితంగా నైజంలో కూలీ విన్నర్‌గా నిలుస్తుంది అన్నడంలో అతిశయోక్తి లేదు.