కూలి వర్సెస్ వార్ 2.. రెండింటిలో ఏది బెస్ట్.. చాట్ జీపీటి షాకింగ్ రెస్పాన్స్..!

కొద్ది గంటల క్రితం బాక్స‌ఫీస్‌ దగ్గర టఫ్ వార్‌ మొదలైన సంగతి తెలిసిందే. వార్ 2 వర్సెస్ కూలి ఈ రెండిటిలో ఏది బెస్ట్ అనే ప్ర‌శ్న‌కు చాట్‌జీపీటిలో అభిమానులు అడగగా.. షాకింగ్ రిప్లై వ‌చ్చింది. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారుతుంది. ఇక కూలి సినిమాకు లోకేష్ కనకరాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించగా.. రజనీకాంత్ హీరోగా మెరిశారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో వార్ 2 రిలీజ్ అయింది. రెండు సినిమాలు ఒకేరోజు రిలీజై మిక్స్డ్ టాక్‌ దక్కించుకున్నాయి. అయితే.. రెండు సినిమాలు నెగటివ్ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

కాగా.. ప్రస్తుతం లాంగ్ వీకెండ్ కావడం.. ఆగస్టు 15, 16, 17 కూడా సెలవులు రావడంతో.. సినిమాను చూడాలని ఈ సినిమాల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా ఏది.. కూలీ, వార్ 2లలో ఏది చూడడం బెస్ట్ అనే ప్రశ్నకు చాట్‌జీపిటీ స్పందించింది. కూలీ చూస్తే ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారా అనే ప్రశ్నలకు చాలా తెలివైన సమాధానాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు వచ్చిన పలు వెబ్సైట్లో, రివ్యూలు, రెస్పాన్స్లను బట్టి కూలి ముందంజలో ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన.. .ఆట్జీపిటి.. మీకు ఏ తరహా సినిమా అంటే ఇష్టం అది ఫ్రిఫ‌ర్ చేయ‌మంటు తెలివైన స‌మాధానం ఇచ్చింది.

మాస్‌, యాక్ష‌న్‌ ప్లస్ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కావాలంటే రజినీకాంత్ నటించిన కూలి సినిమా చూడొచ్చని.. ఒకవేళ యాక్షన్ థ్రిల్లర్ గా స్పై యూనివర్సల్ స్టాండర్డ్స్ కావాలనుకుంటే వార్ 2 సినిమాను వీక్షించవచ్చు అంటూ క్లారిటీ ఇచ్చింది. రజినీకాంత్.. కూలి సినిమాకు వెళ్లాలంటే స్టైల్, పంచ్‌ డైలాగ్స్, ఫ్యాన్స్ హంగామా, ఎంటర్టైన్మెంట్ అన్ని విధాల ఆకట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చిన చాట్ జీపిటి.. వార్ 2 ను తక్కువ చేయలేదు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచిందని.. ఇంటర్నేషనల్ లెవెల్ విజువల్స్, టెన్షన్ ఫుల్ స్టోరీ తో ఆడియన్స్‌ను ఇది కూడా ఆకట్టుకుందంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఇదే న్యూస్‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది.