టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగులో భారీ క్రేజ్‌తో దూసుకుపోతుంది. ముఖ్యంగా.. యూత్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. అందం, నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో పాటే.. ముద్దు మాటలతో కుర్రకారును కట్టిపడ్డేస్తున్న ఈ కేరళ కుట్టి.. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందిన ఆ సినిమాతో.. టాలీవుడ్‌కు పరిచయమైంది. తర్వాత.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ లో నటిస్తూ.. ఆడియన్స్‌కు మరింత దగ్గరవుతూ వచ్చింది. టిల్లు స్క్వేర్‌తో ఒక్కసారిగా టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయిన ఈ అమ్మడు.. ఒక్కసారిగా బోల్డ్ లుక్ తో అందరికి షాక్ ఇచ్చింది.
తన నటనతో కట్టిపడేసింది. సిద్దు జొన్నలగడ్డతో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన అనుపమ.. అతనితో లిప్ లాక్ సీన్స్‌లో సైతం నటించి ఒక్కసారిగా టాప్ ట్రెండింగ్‌కి వచ్చేసింది. మునుపెన్నడూ లేని రేంజ్‌లో ఈ సినిమాతో ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమాపై అనుపమ చేసిన కామెంట్స్ నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్నాయి. టిల్లు స్క్వేర్‌లో లిల్లీ పాత్రలో కనిపించిన అనుపమ.. ఆ పాత్ర పై తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకుంది. సాధారణంగా గ్లామరస్ రోల్ కు దూరంగా ఉండే అనుపమకు.. ఆ రోల్ చేయడం అంత ఈజీ కాదని వివరించింది.
లిల్లీ పాత్రను అంగీకరించడానికి నేను చాలా సమయం ఆలోచించానంటూ చెప్పుకొచ్చిన అనుపమ.. షూటింగ్ ప్రమోషన్స్ టైం లో కూడా ఆ పాత్రకు తగ్గట్లుగా నేను డ్రస్స్‌లు వేసుకోవడానికి చాలా అన్ కంఫర్టబుల్గా ఫీల్ అయ్యా. ఆ పాత్రకు ప్రేక్షకులు నుంచి విమర్శలు వస్తాయని ముందే ఊహించా అంటూ చెప్పుకొచ్చింది. సినిమా రిలీజ్ అయ్యాక అదే జరిగింది. అయితే.. తర్వాత అందరూ నా నటనను, పాత్రను ప్రశంసించడంతో ఎంతో సంతోషంగా అనిపించిందంటూ ఆమె వివరించింది. టిల్లు స్క్వేర్ సినిమా తన కెరీర్‌లో ముఖ్యమైన మలుపు అంటూ వివరించిన ఆమె.. తనకు ఈ సినిమా కొత్త అనుభవాన్ని ఇచ్చిందని.. భవిష్యత్తులో ఎలాంటి విభిన్నమైన రోల్స్ అయ్యినా చేయడానికి ప్రేరణగా మారింది అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుపమ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.