మరో రెండు రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర టఫెస్ట్ ఫైట్ మొదలుకానుంది. ప్రతి ఏడాది సంక్రాంతి, దసరా బరిలో భారీ సినిమాలు రిలీజై.. స్టార్ హీరోల మధ్యన గట్టి పోటీ ఏర్పడుతూ ఉంటుంది. కానీ.. ఈసారి మొట్టమొదటిసారి ఆగస్టు నెలలో ఈ పోటీ వాతావరణం మొదలైంది. మరో రెండు రోజుల్లో రెండు భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులు గ్రాండ్ లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించనున్నాయి. వాటిలో ఒకటి వార్ 2. మరొకటి కూలీ. ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతం రజనీకాంత్ కూలి సినిమాకి భారీ డిమాండ్ కనిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ లోను ఆ జోరు తెలుస్తుంది. బుకింగ్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం ప్రతి ప్రాంతంలోనూ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతూ ఓవర్సీస్ లో అయితే సంచలనం సృష్టిస్తున్నాయి.
కేవలం అడ్వాన్స్ బుకింగ్ తోనే కూలి సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.70 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందంటే.. సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల పూర్తి లెవెల్ బుకింగ్స్ కూడా ప్రారంభమైతే.. సినిమా వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకుంటుందంటూ ఫ్యాన్స్ స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు. ఇక వార్ 2 విషయంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లాంటి ఇద్దరు బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్స్ ఉన్నా.. అభిమానులు ఊహించిన రేంజ్ లో ప్రమోషన్ చేసి వారిని ఆకట్టుకోలేకపోయారు ఈ స్టార్ హీరోస్. కేవలం ఒకే ఒక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌తో సరిపెట్టేసారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలే కాలేదు. ఇలా ఓవరాల్ గా చూసుకుంటే ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కేవలం రూ.11 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇది ఎన్టీఆర్ రేంజ్‌కు చాలా చాలా దారుణమైన బుకింగ్స్ అనడంలో సందేహం లేదు.
ఇలాంటి క్రమంలో సినిమా ఓవర్సీస్ రివ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ముందు వార్ 2 రివ్యూ గురించి మాట్లాడుకుందాం.. వార్ 2 ఓ యావరేజ్ మూవీ.. కానీ.. ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే వార్ సీన్స్ మాత్రం వర్త్.. వాటికోసమైన టికెట్‌కు ఖర్చు చేయొచ్చు అనేలా మూవీ ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. డైరెక్టర్ ఆ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ను తీర్చిదిద్దాడట. ఇక కూలి విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అదరగొట్టిందని.. సెకండ్ హాఫ్ మాత్రం యావరేజ్ గానే ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓవరాల్ గా సినిమాల ఓవర్సీస్ రిపోర్ట్స్ చూస్తే రెండు సినిమాలకు యావరేజ్ టాక్ వినిపిస్తుంది. అయితే వార్ 2కి మాత్రం కూలి కంటే కాస్త బెటర్ రిపోర్ట్స్ అందుతున్నాయి. మరి.. ఆడియన్స్ నుంచి కూడా ఇదే విధంగా రెస్పాన్స్ వస్తుందా.. లేదా.. రెండు సినిమాలు ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటాయి.. ఏ సినిమా ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.