సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తారక్ వర్సెస్ చరణ్ ఫ్యాన్ వార్.. కారణం ఇదే..!

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఈ వివాదానికి కారణం ఏంటి.. అసలేం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కాంబోలో యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 మరో మూడు రోజుల్లో గ్రాండ్గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. అయాన్‌ ముఖర్జీ డైరెక్షన్ లో య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై కియారా అద్వానీ హీరోయిన్గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక ఈ మూవీ తెలుగు వర్షన్‌ను సితారా ఎంటర్టైన్మెంట్ అధినేత నాగవంశీ సొంతం చేసుకోగా.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఎన్టీఆర్ సందడి చేశారు.

Should I Leave?': Jr NTR Loses Cool At Over-Excited Fan During War 2 Pre-Release Event, Threatens To Leave Show Midway - VIDEO

ఇక ఎన్టీఆర్ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని కూడా పురస్కరించుకుంటూ హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్ లో ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. వేలాది మంది అభిమానులు ఈ ఈవెంట్‌ను సక్సెస్ చేశారు. ఇక ఈవెంట్‌లో ఫాన్స్‌ను నియంత్రించేందుకు దాదాపు 1200 మంది పోలీసులు విధులు నిర్వర్తించారు. సండే అయినా.. గవర్నమెంట్ సపోర్ట్, పోలీసుల అండతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించమంటూ నాగవంశీ వెల్లడించారు. ఈ వేడుకలు బాలీవుడ్ స్టార్ హృతిక్ కూడా పాల్గొని అభిమానులను తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ మీకు అన్న.. నాకు తమ్ముడు.. అంటే మనమంతా ఒకటే కుటుంబం అంటూ స్టేజిపై ఆయన చేసిన కామెంట్స్ తారక్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నేను రియల్ టైగర్ తో నటించా.. అతడు స్థాయిని తన ఓన్ టాలెంట్ తో సాధించాడు అంటూ ఎన్టీఆర్ ను ప్రశంసలతో ముంచేత్తాడు హృతిక్.

Acharya Is A Once In A Lifetime Opportunity: Ram Charan

ఈ క్రమంలోనే తారక్‌ అభిమానుల సందడి నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు గట్టిగా అరవడం.. చొక్కాలు విప్పి గాల్లో ఊపడం.. కేకలు వేయడంతో.. ఎన్టీఆర్ తన కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. చాలా డిస్టర్బ్ చేస్తున్నర‌నే హెచ్చరించాడు. తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం ఒక సెకండ్ పట్టదు.. మైక్ ఇచ్చేసి వెళ్లిపోతా.. మీకు ఓకేనా అంటూ అభిమానుల వైపు చూస్తూ మండిపడ్డాడు. తర్వాత తన స్పీచ్ ను కంటిన్యూ చేశాడు. అయితే.. ఈ వీడియోను రామ్ చరణ్ స్పీచ్ ఇచ్చేటప్పుడు మాట్లాడుతున్న వీడియోను కంపేర్ చేస్తూ.. ఎన్టీఆర్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు చరణ్‌ అభిమానులు. రామ్ చరణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా డిస్టర్బ్ అయ్యారు. కానీ ఆ సమయంలో థాంక్యూ థాంక్యూ అంటూ కిస్సెస్ ఇచ్చాడు తప్ప.. ఎన్టీఆర్ లాగా మండిపడలేదని.. ఎన్టీఆర్ స్టార్డం రాగానే పొగరు కనిపిస్తుంది అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు చరణ్ ఫ్యాన్స్. అయితే.. దీనికి తారక్‌ అభిమానుల సైతం తమదైన స్టైల్ లో స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తున్నారు. ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ వర్సెస్ చరణ్ ఫ్యాన్ వార్ పెద్ద దుమారంగా మారింది.