ఆ ప్రొడ్యూసర్ నా డ్రెస్ లాగేసి గంట బలవంతం చేశాడు.. గాయత్రి గుప్తా

సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ ఎప్పటినుంచో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చాలామంది స్టార్ ముద్దుగుమ్మలు సైతం.. తమ లైఫ్ లో ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ సంఘ‌ట‌న‌ల‌ను ఓపెన్ గానే అందరితోనూ షేర్ చేసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసిన వారిలో టాలీవుడ్ నుంచి గాయత్రి గుప్తా మొదటి వరుస‌లో ఉంటుంది. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత ఫిదా, కొబ్బరి మట్ట, ఐస్క్రీం లాంటి సినిమాల్లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాల కంటే.. పర్సనల్ విషయాలు, విభేదాలు, కాంట్రవర్షియల్ కామెంట్స్‌తోనే ఆమెకు మరింత పాపులారిటీ దక్కింది.

Gayathri Gupta: మా నాన్నే నాకు నరకం చూపించాడు.. కాస్టింగ్ కౌచ్ పై 'ఫిదా'  నటి సంచలనం!

కాగా ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి గుప్తా.. తనపై జరిగిన లైంగిక, మానసిక వేధింపులు, అలాగే ఆర్థిక సమస్యల గురించి షాకింగ్ విషయాలను పంచుకుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఎన్నోసార్లు రేప్ ఎటంప్ట్స్‌కి గురయ్యా. కాలేజీ రోజుల్లో హాలీవుడ్ సినిమాలు నుంచి వచ్చిన క్లిప్స్ చూసి ఎంతో భయపడ్డా. తెలుగు వాళ్ళు మంచి వాళ్ళని ఫిక్స్ అయ్యా. కానీ.. ఆడిషన్స్ కు వెళ్ళిన ప్రతిచోట కమిట్మెంట్స్ అడగడం.. బలవంతపు ప్రవర్తన ఎదుర్కోవడం.. రోజురోజుకు పెరిగింది. ధైర్యంగా మాట్లాడితే నన్ను చంపేస్తామని.. రేప్ చేస్తామని బెదిరింపులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ ఆమె వివరించింది.

బాయ్‌ఫ్రెండ్‌ లేని టైంలో రూమ్‌లోకి.. ఆ నిర్మాత నా డ్రెస్‌ లాగేసి, గంటపాటు'  | Actress Gayathri Gupta shares bad experience with producer - Telugu  Filmibeat

ఇందులో భాగంగానే ఓ నిర్మాత, దర్శకుడు కలిసి నాపై లైంగిక దాడికి ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. ఒకసారి ట్రైలర్ హిట్ అయిన సందర్భంగా ఆహ్వానించారు. నేను మద్యం తాగన‌ని ఎంత చెప్పినా బలవంతంగా నాతో తాగించారు. ఒక్కసారిగా పోయడంతో నాకు చాలా మత్తొచ్చేసింది. ఆ టైంలో ప్రొడ్యూసర్ కార్ లో డ్రాప్ చేస్తానన్నాడు. డ్రైవర్ రావడానికి టైం పడుతుంది అంటూ నన్ను తన గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ నా డ్రస్స్ లాగడానికి ప్రయత్నించాడు. అదృష్టవశాత్తు డ్రస్సు లూజ్ గా ఉండడం.. డిజైనర్ వేసిన కుట్లు కారణంగా అది చినగలేదు. కానీ.. ఒక గంట పాటు నన్ను బలవంతం చేశాడు అంటూ గాయత్రి గుప్తా క‌ర్నీరు పెట్టుకుంది.ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు నెటిజ‌న్లు.