తారక, హృతిక్ కాంబో బిగెస్ట్ స్పై యాక్షన్ మల్టీ స్టార్లర్ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్. ఇక ఇప్పటికే సెన్సార్ ఫార్మాలిటీస్ ను కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. తారక్ ఫస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ కావడంతో తెలుగు ఆడియన్స్‌లోను సినిమా పై మంచి హైప్ మొదలైంది. ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ యూసఫ్గుడా పోలీస్ గ్రౌండ్స్ లో నిన్న గ్రాండ్ లెవెల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్లో తారక్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు వర్షం పడలా. ఎవరు తడవలా. నాకు చాలా ఆనందం. ఈవెంట్ ఇంత అద్భుతంగా జరగడానికి ప్రధాన కారణం నాగవంశీ.
13 సంవత్సరాలు క్రితం భాద్‌షా ఈవెంట్లో జరిగిన తొక్కీసులాటలో నా వరంగల్ అభిమాని చనిపోయారు. అప్పటి నుంచి ఓపెన్ ప్రమోషన్స్‌లో జరిగే పబ్లిక్ మీటింగ్స్ కు నేను చాలా దూరంగా ఉంటూ వస్తున్నా. కానీ.. 25 ఇయర్స్ సెలబ్రేషన్స్ మీతో పంచుకోకుండా ఉండలేకపోయా. అభిమానులను కలుసుకోవాలని తాపత్రయం.. దానికి నాగవంశీ నన్ను ఫోర్స్ చేసి ఇక్కడకు తీసుకొచ్చాడు. అందుకే వంశీకి చాలా థ్యాంక్స్. వంశీ నన్ను ఫోర్స్ చేసేలా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అంటూ వివరించాడు. ఇక వార్ 2 స్టోరీ నేను చేయడానికి గల కారణం స్టోరీ, స్టోరీ స్ట్రెంత్ అంటూ వివరించిన ఆయన.. కచ్చితంగా ఈ మూవీ నువ్వు చేయాలని నా వెంటపడి మరి నాకు భరోసా కల్పించింది మాత్రం ఆదిత్య చోప్రా అంటూ వివరించారు.
మీ అభిమానులు గర్వపడేలా ఈ సినిమా రూపొందిస్తా.. నన్ను నమ్మమని ఆయన హామీ ఇచ్చారని.. ఆయనకు ధన్యవాదాలు అంటూ వెల్లడించాడు. ఒకవేళ నేను ఆయన మాట వినకుండా ఉండుంటే ఇంత గర్వంగా నేను ఈ స్టేజ్ పై నిలబడే వాడిని కాదు. నాకు అంత కాన్ఫిడెన్స్ ఆదిత్య చోప్రా ఇచ్చారు. చాలా థాంక్స్. యఫ్రాజ్ ఫిల్మ్స్ టీం అందరికీ ధన్యవాదాలు అంటూ వివరించాడు. నాకు బాంబే అంటే ఇష్టం ఉండదు. అక్కడికి వెళ్లి ఉండాలంటే కష్టం. కానీ.. నాకు ఇంట్లో ఉన్నట్టు హైదరాబాద్‌లో ఉన్నం అనిపించేలా అక్కడ టీం నన్ను చూసుకున్నారు. వాళ్ళందరికీ థాంక్స్. వైఆర్ఎఫ్ ఫిలిమ్స్ లో మళ్ళీ సినిమా చేయడానికి ఎంతో ఆసక్తిగా ఉన్నానంటూ వివరించాడు తారక్.
ఇక వార్ 2 లాంటి సినిమాను అయ్యాన్ థప్ప ఖచ్చితంగా ఎవ్వరు ఎప్పుడు రూపొందించలేరు.. ఆగస్టు 14న సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది.. ఈతరంలో గ్రేటెస్ట్ మూవీ అయాన్ ముఖర్జీ తెరకెక్కించాడు. ఇద్దరు స్టార్స్ ని పెట్టి ఇలాంటి, అద్భుతమైన విజువల్ సినిమాని తీయడం అంత సులువు కాదు. ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపాడో నాకు తెలుసు అంటూ తారకా అయాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. సెట్స్‌లో నన్ను, హృతిక్ సార్ ని గైడ్ చేసే డ్రైవింగ్ ఫోర్స్ గా ఉన్నందుకు అయాన్ ధన్యవాదాలు. 2025లో అయాన్ డైరెక్ట్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని నేను ప్రామిస్ చేస్తున్నా అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఎవరెన్ని మాట్లాడిన బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. పండగ చేసుకోండి అంటూ తారక్ రెండు కాలర్లు ఎత్తి సందడి చేశాడు. ఆయనతో పాటే హృతిక్ రోషన్ కూడా కాలర్ ఎగరేశారు.