టాలీవుడ్ దర్శకుధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో SSMB29 రన్నింగ్ టైటిల్ తో ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం దాదాపు మహేష్ సంవత్సరంన్నర నుంచి పనిచేస్తున్నారు. అయితే.. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక నేడు మహేష్ 50వ సంవత్సరంలో అడుగుపెట్టిన క్రమంలో బర్త్ డే రోజున సినిమా నుంచి అప్డేట్ వస్తే చాలని ఎంతో ఆశగా ఎదురు చూశారు ఫ్యాన్స్. కాగా మహేష్.. గోల్డెన్ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా ఏదో ఒక అప్డేట్ ఇవ్వకపోతే బాగోదనే ఉద్దేశంతో జక్కన్న చిన్న హింట్ మాత్రం ఇచ్చారు.
ఒక క్రేజీ ట్రీట్‌ను షేర్ చేసుకున్నాడు. ఆయన ఈ ట్విట్‌లో.. మీరంతా మా సినిమా కోసం ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో నాకు తెలుసు. కానీ సినిమాకు ఉన్న స్కోప్‌కు స్టోరీని చెప్పడానికి ఒక్క ప్రెస్ మీట్ అయితే సరిపోదు. ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ రివీల్ చేయడానికి కుదరట్లేదు. కానీ అప్డేట్స్ రివీల్ చేయటానికి.. ఇప్పటివరకు ఎవరు కనీవినీ ఎరుగని పద్ధతిని ఫాలో కానున్న. అదేంటో నవంబర్లో తెలుస్తుంది. మీ ఓపిక, సహనానికి మా ధన్యవాదాలు అంటూ షేర్ చేసుకున్నాడు. దీంతోపాటే.. మహేష్ బాబు ఫ్రీ లుక్ ను రిలీజ్ చేశాడు జక్కన్న.
ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక మహేష్ బాబు మెడలో త్రిశూలం, నంది, ఢమరుకం బొమ్మలతో ఉన్న రుద్రాక్ష మాలని ఈ ప్రీ లుక్ లో క్లారిటీగా చూపించాడు. మహేష్ ఛాతి మీద రక్తం మరకలు కూడా హైలెట్ చేశారు. మహేష్ టీ షర్ట్ ధరించినట్లు చూపించారు. చూస్తుంటే ఈ సినిమా డివోషనల్ టచ్ తో రూపొందుతుందని అర్థమైంది. అయితే ఇంచుమించు ఇదే లుక్ పవన్ నటించిన బ్రో ది అవతార్ మూవీ ఫ్రీ లుక్ లో కూడా మెరిసింది. దాదాపు ఆ లాకెట్ సైతం నంది, త్రిశూలం బొమ్మలతో తయారు చేసి దండలా ఉంది. అంతేకాదు పవన్ ఈ సినిమాలోని టీ షర్ట్ ధరించి ఉన్నారు. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ జక్కన్న.. మహేష్ సినిమా కోసం పవన్ లుక్ కాపీ కొట్టారు అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.