టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప 2 పాన్ ఇండియా లెవెల్లో రిలీజై సాలిడ్ సక్సస్ కొట్టి వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా అప్పట్‌లో బుక్ మై షోలో సరికొత్త రికార్డ్‌లను క్రియేట్ చేసింది. బుకింగ్ ప్రారంభించిన వెంటనే హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోవడం మొదలైంది. ఒకానొక టైం లో గంటకు లక్ష టికెట్లు కూడా అమ్ముడుపోయిన సందర్భాలు ఉన్నాయి. 24 గంటల్లో మిలియన్ టికెట్లు బుక్ అయినా రికార్డ్ సైతం పుష్ప 2 సినిమాకు సొంతం. ఇక పుష్ప 2 తర్వాత బుక్ మై షో లో ఈ రేంజ్‌లో టికెట్ బుకింగ్ మళ్ళీ జరగనే లేదు.
హిందీ, తెలుగు, తమిళ్ ఏ భాష లోనూ ఆ రేంజ్‌లో బుక్ మై షో లో టికెట్లు అమ్ముడుపోలేదు. అయితే.. తాజాగా రజినీకాంత్ నటించిన కూలీ మూవీ మరీ పుష్ప రేంజ్ కాకున్నా ఇన్నాళ్ల తర్వాత హైయెస్ట్ టికెట్ బుకింగ్‌తో కూలీ ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తుంది. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రస్తుతం బుక్ మై షో లో రికార్డు లెవెల్లో బుకింగ్స్ సాధిస్తుంది. బుకింగ్స్ ప్రారంభించినప్పటి నుంచి కంటిన్యూస్గా టికెట్లు అమ్ముడుపోతూనే ఉన్నాయి. ఒకానొక టైంలో గంటకు 50.8 వేల టికెట్లు కూడా అమ్ముడయ్యాయి.
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పుష్ప 2 తర్వాత మళ్లీ ఆరెంజ్ బుకింగ్స్ నమోదు చేస్తున్న సినిమాగా కూలీ రికార్డు క్రియేట్ చేసింది. ఇక పుష్ప 2 లెవెల్ లో బుకింగ్స్ సాధించాలంటే సినిమా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను దక్కించుకోవాల్సి ఉంది. కాగా.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లోకేష్ కనకరాజు హిట్ ట్రాక్‌ను ఈ సినిమాతో కంటిన్యూ చేస్తాడా.. లేదా ఏ రేంజ్ లో రిజల్ట్ అందుకుంటాడు.. రజిని, నాగార్జునలకు ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ తెచ్చి పెడతాడో వేచి చూడాలి.