గుట్టుగా కానిచ్చేస్తున్న ఆ పెద్ద హీరో సినిమా.. ఎందుకంత సీక్రెట్ అంటే..!

టాలీవుడ్ ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ప్రస్తుతం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమాపై కార్మికుల సమ్మె ప్రభావం ఉంటుందనే ప్రశ్నకు తాజాగా సినిమా నిర్మాతల్లో ఒకరైన నవీన్ యార్నేని రియాక్ట్ అయ్యారు. మూవీ హీరో పవన్ కళ్యాణ్ పై వారం రోజుల షూట్ పెండింగ్లో ఉందని.. మరో 25 రోజులపాటు ఇతర స్కెడ్యూల్ పూర్తి చేయాల్సి ఉందంటూ వివరించాడు. అంటే.. ఈ సినిమా మరో నెల రోజుల్లో ఎలాగైనా పూర్తి చేసుకుని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగ‌వంతం అవుతాయి. కాగా.. కార్మికుల మెరుపు సమ్మె ప్రభావం ఇండస్ట్రీపై తీవ్రంగానే పడింది అనడంలో సందేహం లేదు.

Climax shoot of Pawan Kalyan's Ustaad Bhagat Singh wrapped up - Telangana  Today

వేతన సవరణ 30% పెంపుకు నిర్మాతల మండలి, ఫిలిం ఛాంబర్ వర్గాలు మాత్రం ససేమిరా అంగీకరించడం లేదు. ఫెడరేషన్ అనుబంధం అసోసియేషన్లలో ఉన్న కార్మికుల స్థానంలో కొత్త టాలెంట్‌ను యాక్సెప్ట్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ సూచనలు చేసింది. దీనికి లేబర్ కమిషన్ నుంచి అనుమతి ఉందని కూడా ఛాంబర్ లేఖలో క్లారిటీగా పేర్కొంది. వీటన్నింటికీ మీరు సిద్ధమేనా అనే ప్రశ్నకు నవీన్ యార్నేని రియాక్ట్ అవుతూ.. ఒకవేళ ఆ విధానం పనిచేస్తుందని భావిస్తే ఖచ్చితంగా అనుసరిస్తామని చెప్పుకొచ్చాడు. వేతన సవరణ అంశంపై రియాక్ట్ అవుతూ నేను ఇప్పుడు దానిపై ఎలాంటి కామెంట్స్ చేయలేను.

స్తాద్ భగత్ సింగ్ పై ఫెడరేషన్ ప్రతినిధులు దాడి చేశారని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదంటూ నవీన్‌ చెప్పక‌నే చెప్పేసాడు. ఓ త‌మిళ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆయన వీటన్నింటిపై క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు.. పలువురు నిర్మాతలు సైతం ఈ కార్మికుల సమ్మెపై నిరసన వ్యక్తం చేస్తూ.. ఇప్పటికే ఇతర ఇండస్ట్రీలతో పోలిస్తే టాలీవుడ్ లో వేతనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయని.. ఇలాంటి క్రమంలో మెరుపు సమ్మె సరైనది కాదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. కాగా కార్మికుల సమ్మె కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే కొన్ని అగ్ర నిర్మాణ సంస్థలు వాళ్లతో బేరసారాలు సాగిస్తూ.. సీక్రెట్‌గా పనులు పూర్తి చేస్తున్నాయని టాక్. చిన్న సినిమాల నిర్మాణానికి ఇది ఎలాంటి అడ్డంకులను తెచ్చి పెడుతుందో.. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.