సినీ కార్మికుల వేతనాల పెంపుపై గత కొన్ని రోజులుగా చర్చలు టాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే టీజీ విశ్వ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఇక ఆయన కామెంట్స్ వివాదాస్పదంగా మారడంతో తాజాగా మరోసారి అయిన రియాక్ట్ అయ్యారు. తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారంటూ చెప్పుకొచ్చిన ఆయన.. హైదరాబాద్‌లో ఎంతోమంది టాలెంటెడ్ పర్సన్లు ఉన్నారు. మా ప్రొడక్షన్ హౌస్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ) సహా తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేసే వారిలో దాదాపు 70 శాతం మంది ఇక్కడవాళ్లే ఉంటారు. ఇండస్ట్రీ అభివృద్ధికి ముఖ్యం.
గతంలో 10 శాతం ఉన్న స్కిల్ గ్యాప్.. ఇప్పుడు 40% పెరగడానికి కారణం కేవలం టాలెంట్ లేకపోవడమే కాదు.. కొత్త టెక్నీషియన్స్, ఆర్టిస్టులను పరిశ్రమలోకి రానివ్వకుండా.. రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు వరకు అక్రమంగా డిమాండ్ చేసే గ్రూపులే అంటూ ఆయన వివరించాడు. స్కిల్ ఉన్న వాళ్లకు ఇది ప్రధానమైన అడ్డంకిగా మారిందని.. కొత్త ప్రతిభను అడ్డుకుంటూ.. పరిశ్రమ ప్రయోజనాలను పక్కదారి పట్టించే విధంగా సొంత లాభాల కోసం వ్యవస్థను నియంత్రించడం భవిష్యత్తులో పరిశ్రమకు మరింత నష్టదాయకం అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక్కడి వారికి అవకాశాలు కల్పించాలంటూ వివరించిన విశ్వప్రసాద్.. స్కిల్ డెవలప్ చేయాలని.. నేను ఇక్కడ వారి టాలెంట్‌ను తక్కువగా అంచనా వేస్తున్నానని భావిస్తున్నారు.. అది పూర్తిగా తప్పుటి అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు. నా విమర్శలు ప్రతిభ పై కానే కాదు. కేవలం వ్యవస్థ పైనే. నేను మాట్లాడేది ఇక్కడ టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, తెలుగు సినిమాకు ఎప్పటినుంచో గ్రాండ్ సపోర్ట్ గా ఉన్నారు. వాళ్లను అడ్డుకునే వ్యవస్థని తొలగించండి. మెరిట్ కి ప్రాధాన్యం ఇవ్వండి. వడ్డీల కోసమే ఉండే గ్రూపులను అడ్డుకోవడం మన రెస్పాన్సిబులిటీ అంటూ వివరించాడు. ప్రస్తుతం ఆయన చేసిన పోస్ట్ వైరల్ గా మారుతుంది.