కోలీవుడ్ థలైవార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో ఉపేంద్ర, అమీర్‌ఖాన్, శృతిహాసన్, శౌభిన్ షాహీర్, పూజా హెగ్డే, రెబా మౌనిక జాన్ తదితరులు కీలక పాత్రలో మెరుస్తుండగా.. టాలీవుడ్ కింగ్ నాగార్జున నెగటివ్ షేడ్స్‌లో పవర్ఫుల్ విలన్ గా కనిపించనున్నారు. ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో.. ప్రమోషన్స్‌లో జోరు పెంచారు టీం. ఇక సినిమాలో అందరి రోల్ కంటే ఇప్పుడు నాగార్జున నటించిన సైమన్ రోలే హైలెట్ గా మారుతుంది.
నాగార్జునపై తెగ ప్రశంసలు కురిపిస్తూ.. ఆయన అదరగొట్టారని.. పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున.. నవ్విస్తూనే అందరిని భయపెడతారని.. సినిమాల్లో చూస్తే కచ్చితంగా షాక్ అవుతారంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. సైమన్ రోల్‌పై ఆడియన్స్‌లో నెక్స్ట్ లెవెల్‌లో హైప్ నెలకొంది. ఇక ప్రమోషన్స్ పరంగా ఆడియన్స్‌ను మేకర్స్ భారీగా ఆకట్టుకున్నారని చెప్పాలి. ఈ సినిమాకు పోటీగా వస్తున్న వార్ 2 ఓపెన్ బుకింగ్స్‌ను మించిపోయే రేంజ్‌లో కూలి కలెక్షన్లు అందుకుంటుంది.
ఈ క్రమంలోనే కూలి పై ఆడియన్స్‌లో ఏ రేంజ్‌లో హైప్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. కాగా.. ఈ సినిమాలో అత్యంత హైలెట్‌గా మారిన సైమన్ రోల్ కోసం మొదట నాగార్జునను కాకుండా.. మరో హీరోను భావించారట. ఆయన కూడా టాలీవుడ్ స్టార్ హీరోనే అంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణకు మొదట ఈ రోల్ గురించి వివరించారట. అయితే ఇతర హీరోల సినిమాల్లో.. అది కూడా నెగటివ్ షేడ్స్ వల్ల.. రోల్‌లో నేను ససిమేరా నటించనని.. బాలయ్య తాగేసి చెప్పారట. దీంతో నాగార్జున దగ్గరకు కథ వెళ్ళింది. అయితే నాగార్జున సైతం ఈ రోల్‌లో నటించడానికి చాలా ఆలోచించాడట. ఒకటికి.. ఆరు సార్లు లోకేష్ కథ నరేట్ చేసిన తర్వాత సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు స్వయంగా లోకేష్ చెప్పుకొచ్చాడు. ఇక మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఆడియన్స్ ను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో.. నాగార్జునకు సైమన్ రోల్ ఎలాంటి పేరు తెచ్చి పెడుతుందో చూడాలి.