” కూలీ ” మూవీ స్టోరీ లీక్.. ఈ పాతకాలం కథ వర్కౌట్ అయ్యేనా..!

కోలీవుడ్ హీరో రజనీకాంత్, లోకేష్ కనకరాజ్‌ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ. ఆడియన్స్‌లో భారీ హైప్ నెల‌కొల్పిన ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు మేకర్స్‌. మరికొద్ది గంటల్లో సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ నుంచి ఓ మూవీ వస్తుందంటే కచ్చితంగా సినిమా ప్రమోషనల్ కంటెంట్‌తోనే 70% హిట్ అయ్యేలా ప్లాన్ చేస్తాడు అనడంలో అతిశయోక్తి లేదు. మిగిలిన 30% కేవలం యావరేజ్ టాక్‌ వచ్చినా చాలు.. సినిమా బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తుంది. అలా.. ఇప్పటికే లియో సినిమా విషయంలోనూ తన సత్తా చాటుకున్నాడు లోకేష్ కనక‌రాజ్.

Rajinikanth's Coolie gets a trailer date. When and where will the makers  reveal the highly-awaited trailer? - The Economic Times

ఇక కూలి సినిమా అనౌన్స్మెంట్ రోజు నుంచే భారీ బ‌జ్ నెలకొల్పింది. ఎప్పుడైతే సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ అయ్యాయో.. అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. ఇక మరికొద్ది గంటలో సినిమా థియేట్రిక‌ల్‌ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఇలాంటి క్ర‌మంలో సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్‌.. ఇదేనంటూ ఓ క‌థ‌ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.. రహస్యంగా ఓ ముఠా అక్రమ రవాణా చేస్తూ ఉంటారు. ఇక ఈ ముఠా కాస్ట్లీ వస్తువులను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ.. కూలీల ద్వారా తరలిస్తారు. ఈ ముఠా కూలీలను అసలు మనుషుల్లానే చూడరు. పశువుల కన్నా హీనంగా.. వారి పట్ల కిరాతకంగా ప్రవర్తిస్తారు. అలాంటి టైంలో ముఠాకి ఎదురు తిరిగి ధైర్యంగా ఓ కూలి నిలబడతాడు.

Rajinikanth's 171st film, Coolie release date confirmed. Lokesh Kanagaraj  makes it official - The Economic Times

ఇదే కథను సినిమాగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. తన శక్తి, తెలివి, ఆత్మవిశ్వాసంతో తనదైన స్టైల్ లో ఆ కూలీ చేసిన పోరాటం.. కార్మికుల గౌరవాన్ని కాపాడే సాటి కార్మికుడిగా తన పడే కష్టాలు రజనీకాంత్ పాత్రలో చూపించనున్నాడట లోకేష్‌. కేవలం రజినీకాంత్ రోల్ వింటుంటేనే సినిమాపై ఆసక్తి పెరిగిపోతుంది. ఇక రజనీకాంత్ స్టైల్, లోకేష్ కనక‌రాజ్ మేకింగ్ స్టైల్ దానికి తోడైతే.. మూవీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. కాగా.. ఇప్పటివరకు పాన్‌ ఇండియా లెవెల్‌లో.. బాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ కూడా అన్ని ఇండస్ట్రీలకు రూ.1000 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టిన రికార్డ్ క్రియేట్ అయింది. కానీ.. కోలీవుడ్ మాత్రం వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరనేలేదు. అయితే కూలి సినిమాతో న‌జినీ ఈ రికార్డ్ బ్రేక్ చేయ‌డం ఈ ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిజంగా స్టోరీ లైన్‌ అదే అయితే.. పాతకాలం కథతో రజినీ ఎలాంటి రిజ‌ల్ట్ అందుకుంటాడో చూడాలి.