కింగ్డమ్ బ్లాక్ బస్టర్ రికార్డ్.. 2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. గౌతమ్ తిన్న‌నూరి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. భారీ అంచనాల నడుమ రిలీజై బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జులై 31న‌ గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను భారీ లెవెల్లో ఆకట్టుకుంది. దీంతో క‌లెక్ష‌న్‌ల‌పై కూడా ఆ ప్రభావం పడింది. ప్రీమియర్ షోస్, ఓపెనింగ్ కలెక్షన్ కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు రూ.39 కోట్ల గ్రాస్ స‌సూళ్లు కొల్లగొట్టిన కింగ్డమ్.. రెండో రోజు కూడా అదే జోరు చూపించింది. మంచి ఆక్యుఫెన్సీ తో భారీ కలెక్షన్లు కొల్లగొట్టి.. రెండో రోజుకి 50 కోట్ల క్లబ్ లోకి చేరింది.

ఇక సినిమా ఫస్ట్ షో తోనే హిట్ టాక్ రావడంతో.. సెకండ్ డే వ‌ర‌ల్డ్ వూడ్‌గా రూ.13 కోట్ల కలెక్షన్లు ద‌కం్కించుకున్నాడు రౌడీ హీరో. మొత్తం గా రెండు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.53 కోట్ల గ్రస్ వ‌సూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ రికార్డ్ ని సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని మేకర్స్‌ అఫీషియల్‌గా ప్రకటించారు. రెండు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ వచ్చాయని.. నైజంలో రూ.1.65 కోట్ల కలెక్షన్ అందుకున్న‌ట్లు తెలుస్తుంది.

ఇక‌ సీడెడ్ లో రూ.79 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.48 లక్షలు, గుంటూరు రూ.21 లక్షలు, కృష్ణ రూ.21 లక్షలు, ఈస్ట్ రూ.26 లక్షలు, వెస్ట్ గోదావరి రూ.18 లక్షలు, నెల్లూరు రూ.13 లక్షల షేర్వసూలు ద‌క్కాయని.. ఇలా మొత్తం గా రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.14 కోట్ల షేర్ వ‌సూళ్లు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ రిత్యా.. వీకెండ్ లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ముందు ముందు ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుంది చూడాలి.