కింగ్డమ్ లో నటించిన ఆ పెద్ద హీరో ఎవరో తెలిసిపోయిందిగా..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోలో హిట్ కొట్టి దాదాపు ఆరేళ్లు గడిచిపోయింది. సినిమా కోసం ఎంతగా కష్టపడినా ఊహించిన రేంజ్ లో సక్సెస్ మాత్రం అందుకోలేకపోతున్నాడు విజయ్. ఈ క్రమంలోనే చివరిగా ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ఆడియన్స్ను పలకరించి బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇలాంటి క్రమంలో తాజాగా కింగ్డమ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించాడు విజయ్ దేవరకొండ. ఇక ఇప్పటికే.. సినిమా ఓవర్సీస్‌తో పాటు.. ఇండియాలో పలు ప్రాంతాల్లో ప్రీవియర్ షోస్‌ ముగించుకుంది. ఇక.. ప్రపంచవ్యాప్తంగా నేడు గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ముందు ముందు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.

ఇలాంటి క్రమంలోనే తాజాగా బుధవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైర‌ల్‌గా మారుతున్నాయి. తాజాగా రిలీజ్ అయిన కింగ్డమ్ ట్రైలర్‌కు ట్ర‌మాండస్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ఇంటరేక్షన్‌తో ఆడియన్స్‌ను మెప్పించాడు. భాగ్యశ్రీ, సత్యదేవ్‌ ఆకట్టుకున్నారు. నెగిటివ్ షేడ్స్‌లో ఉన్న పాత్రలో మలయాళ నటుడు వెంకటేష్ విపి ఆడియన్స్‌లో మంచి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేశాడు. ఇక ట్రైలర్ చివర్లో కాంతారా స్టైల్ లో మాస్క్ మ్యాన్ కనిపించిన సంగతి తెలిసిందే. ఇక‌ కథలో ఈ రోల్‌ కీలకంగా ఉందని.. ట్రైలర్‌తోనే ఆడియన్స్‌కు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

అయితే.. ఈ మాస్క్ మ్యాన్ ఎవరో తెలుసుకోవాల‌నే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే ఇదే విషయాన్ని విజయ్ దేవరకొండ దగ్గర ప్రస్తావించగా.. విజయ్ దేవరకొండ దీనిపై రియాక్ట్ అవుతూ.. థియేటర్‌లోనే సినిమా చూసి తెలుసుకోవాలని.. ఆ పాత్రలో నటించింది ఓ పెద్ద హీరో అంటూ వివరించాడు. ఇంతకీ ఆ బిగ్ హీరో ఎవరై ఉంటారని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. కాగా కొంతమంది మాత్రం ఆ పెద్ద హీరో మరెవరో కాదు.. విజయ్ దేవరకొండనే ఆ మాస్క్ మ్యాన్ రోల్‌లో తానే నటించి ఉంటాడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నదమ్ముల సెంటిమెంట్‌తో డిఫరెంట్ గ్యాంగ్ స్టార్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాతో విజయ్ దేవరకొండ.. సక్సెస్ అందుకుంటాడో.. లేదో.. చూడాలి.