బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఇషా కోపికర్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చంద్రలేఖ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇక్కడ కూడా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఇక తాజాగా.. ఈమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కినేని నాగార్జున గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. 1998లో వాళ్ళిద్దరూ కలిసి నటించిన చంద్రలేఖ సినిమాకు సంబంధించిన కొన్ని సంచలన విషయాలను రివీల్ చేసింది. ఇందులో తను లేక పాత్రలో మెరిసింది.
అయితే.. ఈ సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఓ సంఘటన గురించి ఆమె మాట్లాడుతూ.. నాగార్జున గురించి ఇప్పుడు నేను చెప్పే విషయం ఆయన అభిమానులు ఎవరు నమ్మరు. చంద్రలేక సినిమా షూట్ టైంలో నాగార్జున గారు నన్ను చాలాసార్లు చెంప పైన కొట్టారు. ఈ సినిమాలో నాగార్జున నన్ను చంపపై కొట్టే సీన్ ఒకటి ఉంటుంది. కానీ.. ఆయన నా చెంపపై మెల్లిమెల్లిగా కొట్టడంతో ఆ సీన్ సరిగ్గా రాలేదు. షూటింగ్ టైంలో ఒక సీన్ సరిగ్గా రాకపోయినా.. నాకే అది నచ్చదు. దీంతో నిజంగానే బలంగా కొట్టమని నాగార్జున గారిని నేనే కోరుకున్నా. అందుకు ఆయన అసలు అంగీకరించలేదు. బలవంతం చేయడంతో ఆయన తప్పని పరిస్థితుల్లో చెంపపై చెల్లుమని కొట్టాడు. అయితే.. ఆ సీన్‌కు అవసరమైన కోపాన్ని నేను చూపించలేకపోయా.
అవుట్‌పుట్ సరిగ్గా రాలేదు. మళ్ళీ ఆ సీన్ కోసం కోపంగా కనిపించే ప్రయత్నంలో ఎన్నోసార్లు రీటెక్స్ తీసుకున్నాం. దీంతో.. నన్ను 14 సార్లు నాగార్జున గారు చెంపపై కొట్టారు అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చెంప దెబ్బలు తిన్న తర్వాత నా మొఖం వాచిపోయిందంటూ వివరించింది. అంతేకాదు.. ఆయన చేతి గుర్తులు నా ఫేస్ పై చాలా టైం ఉండిపోయాయంటూ చెప్పుకొచ్చింది. అప్పుడు నాగార్జున కూడా నన్ను చూసి చాలా బాధపడ్డారని.. వెంటనే వచ్చి సారీ చెప్పారు.. నేను వద్దని ఆయనతో వారించా. ఆ సీన్ కోసం నేను డిమాండ్ చేయడం వల్లే మీరు అలా చేశారు కదా.. క్షమాపణ అవసరం లేదని గుర్తు చేశా అంటూ ఆమె వివరించింది. ఈ సినిమా ఆమెకు మంచి ఇమేజ్ను క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఏకంగా 80 కి పైగా సినిమాల్లో మెరిసింది. ఇక చివరిగా అయాలాన్ మూవీలో ఆకట్టుకున్న ఈషా.. ప్రస్తుతం సినిమాలతో పాటు పాలిటిక్స్ లోను కీలక పాత్ర పోషిస్తుంది.