కింగ్‌డ‌మ్ రిలీజ్.. విజయ్ దేవరకొండ ముందున్న టార్గెట్ ఇదే..!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్‌డ‌మ్ ఈ నెల 31న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను మరో రెండు రోజుల్లో పలకరించనున్న టీం.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆడియన్స్‌లో మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు.. గౌతం తిన్ననూరి దర్శకుడిగా వ్యవహరించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్లపై సూర్యదేవర నాగావంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ కానుంది.

What's The Business Target For VD's Kingdom? | What's The Business Target  For VD's Kingdom?

ఇక సినిమా రెండు పార్ట్‌లకు కలిపి దాదాపు రూ.140 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సినిమా అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ కూడా భారీ లెవెల్ లో జరగనునట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కోసం రూ.120 కోట్ల వరకు బిజినెస్ డీల్ క్లోజ్ అయిందట. ఈ క్రమంలోనే కింగ్‌డంకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

Kingdom Telugu Breakeven: 50 Cr Share - TrackTollywood

ఈ క్రమంలోనే సినిమా హిట్ కావాలంటే దాదాపు రూ.140 కోట్ల వరకు కలెక్షన్లు కల్లగొట్టాల్సి ఉంది. ఇక.. గత సినిమాలతో వరుస డిజాస్టర్లను ఎదుర్కొన్న విజయ్ ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టి రికార్డులు క్రియేట్ చేసేయాలని కసితో ఉన్నారు. ఇలాంటి క్రమంలో సినిమాపై ఉన్న అంచనాల రిత్యా.. మూవీ రిలీజై ఫస్ట్ డే.. ఫస్ట్ షోతో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంటే బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ కొట్టడం కాయం. సులువుగా రూ.200 కోట్ల కలెక్షన్లు కొల్లగొడుతుంది అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక జులై 31న రిలీజై సినిమా ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.