టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో వస్తున్న బిగ్గెస్ట్ సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. uv క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ ప్రమోద్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష మెరవనుంది. అయితే.. దాదాపు రెండేళ్ల క్రితం ప్రారంభమైన సినిమా షూట్ ఎప్పటికప్పుడు డిలే అవుతూ వస్తుంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కావాల్సిన సినిమా విఎఫ్ఎక్స్ కారణాలవల్ల అలాగే.. ఒక్క స్పెషల్స్ సాంగ్ పెండింగ్ ఉండడంతో ఇప్పటి వరకు రిలీజ్ ఆగిపోయింది. అయితే.. తాజాగా సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ కూడా పూర్తి చేశారు టీం. అలాగే సినిమా టీజర్ విషయంలో పిఎఫ్ ఎక్స్ కారణంగా ఎదుర్కొనే ట్రోల్స్ పై రీ వర్క్ చేసి విఎఫ్ఎక్స్ కూడా మెరుగుపరుస్తున్నారు.
కాగా దాదాపు రూ.75 కోట్ల వరకు ఈ వీఎఫ్‌ఎక్స్ ఖర్చుపెట్టారట. ఇదిలా ఉంటే.. రివర్క్ ప్రారంభించిన ఈ విఎఫ్ఎక్స్ పనులు ఆగస్టు చివరినాటికి పూర్తవుతాయని.. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 25న సినిమాను రిలీజ్ చేస్తారంటూ గత కొంతకాలంగా వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా బాబి కొల్లి రియాక్ట్ అవుతు క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 25న ఓజి, అఖండ 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాంటి టైం లో మేము ఎందుకు రిలీజ్ చేస్తాం. పండగలోనే సినిమాను రిలీజ్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు.. చిరంజీవి గారి సినిమా వచ్చినప్పుడే పండగ అంటూ బాబి కొల్లి క్లారిటీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే సినిమా సెప్టెంబర్ 25న వస్తుందని వచ్చే వార్తలు అన్ని ఫేక్ అని తేలిపోయింది. కాగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వీఎఫ్ఎక్స్ వర్క్ పూర్తవడానికి మరికొంత సమయం పడుతుందని.. డిసెంబర్లో సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే డిసెంబర్లో ది రాజా సబ్ సినిమా లాక్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పుడు.. రాజాసాబ్ సినిమా వాయిదా పడనుందని.. వచ్చేయడాది సంక్రాంతికి ఈ మూవీ సినిమా రిలీజ్ అవుతుంది అంటూ టాక్ నడుస్తుంది. ఇక టాలీవుడ్ బాక్సాఫీస్‌కు డిసెంబర్ లక్కి మంత్ అనడంలో అతిశయోక్తి లేదు. డిసెంబర్‌లో రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకుంటూ వస్తున్నాయి. ఉదాహరణకు.. అల్లు అర్జున్ నటించిన పుష్ప ప్రాంఛైజ్‌లు డిసెంబర్లోనే రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకున్నాయో తెలిసిందే. అంతే కాదు చిరంజీవికి సంబంధించిన పలు సినిమాల సైతం డిసెంబర్లో రిలీజై మంచి సక్సెస్ దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే మరోసారి చిరంజీవి డిసెంబర్‌లో విశ్వంభరతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. మరీ ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందో లేదో వేచి చూడాలి.