” కింగ్‌డ‌మ్‌ “పై రష్మిక క్రేజీ ట్విట్.. ముద్దు పేరు రివల్ చేసిన విజయ్ దేవరకొండ..!

టాలీవుడ్ నేషనల్ క్ర‌ష్‌ రష్మిక మందనా గతేడాది తను నటించిన పుష్పా 2, ఛావా సినిమాలతో వరుసగా రెండు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్లు ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కుబేర సినిమాతో మరోసారి హిట్‌ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే తను నటించిన గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఈ సినిమా తర్వాత.. లేడీ ఓరియంటెడ్ సినిమాలోను అమ్మడు మెర‌వ‌నుంది. ఇలాంటి క్రమంలో సినిమాల కంటే ఎక్కువగా.. తన పర్సనల్ వార్తలతో మ‌రింత వైరల్‌గా మారుతుంది.

గత కొంతకాలంగా టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో.. రష్మిక రిలేషన్ లో ఉందంటూ వార్తలు వైరల్ అవుతున్న‌ సంగతి తెలిసిందే. తాజాగా.. విజయ్‌కు జంటగా నటించిన డియర్ కామ్రేడ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే మరోసారి వీళ్ళిద్దరి డేటింగ్ వార్తలు వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే రష్మిక, విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ కింగ్డమ్ సినిమాను ఉద్దేశిస్తూ చేసిన ట్విట్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. కింగ్‌డ‌మ్ ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకోగా.. ఇటు రష్మిక దానికి రిప్లై ఇచ్చింది.

Dear Comrade Trailer: Vijay Deverakonda's and Rashmika Mandanna's fiery and  intense love story is crackling

ఈ నెల 31వ తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న.. ఆరోజు విజయ్ ఫైర్ చూడాలని ఉంది అంటూ ఆమె పంచుకుంది. గౌతమ్ తిన్న‌నూరి, అనిరుధ్, విజయ్ దేవరకొండ లాంటి ముగ్గురు జీనియస్లు కలిసి సృష్టించిన ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అంటూ రాసుకొచ్చింది. ఇక రష్మిక పోస్ట్‌ను చూసిన విజయ్ దేవరకొండ దానిపై రియాక్ట్ అవుతూ.. ర‌స్సులు.. అంటూ లవ్ సింబల్ తో పాటు ఎంజాయ్ ది కింగ్డమ్ అంటూ ట్విట్‌ చేసాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో మరోసారి వైరల్ గా మారడంతో.. వీళ్ళిద్దరి ప్రేమపై నెటిజ‌న్స్ ర‌క‌ర‌కాలుగా రియాక్ట్ అవుతున్నారు.