టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎవైటెడ్‌గా ఫీచర్ ప్రాజెక్టులలో త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబోలో రూపొందనున్న సినిమా కూడా ఒకటి. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ నెటింట తెగ వైరల్ గా మారుతుంది. వీళ్ళిద్దరి కాంబోలో రావాల్సిన ఆ సినిమా క్యాన్సిల్ అయిపోయిందంటూ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇక ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అవడానికి కారణం కూడా వెంకటేషే అట. ఇంతకీ సినిమా క్యాన్సిల్ అవడానికి వెంకటేష్ కారణం ఏంటి.. ఏం జరిగింది.. ఒకసారి తెలుసుకుందాం.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన డైరెక్షన్ తీరు, డైలాగ్ డెలివరీ.. విజన్ ఇలా ప్రతి విషయంలోను ఆకట్టుకుంటూ తన మార్క్ చూపిస్తునే ఉంటాడు. ముఖ్యంగా వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌లుగా నిలిచిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి సినిమాల కోసం రైటర్ గా త్రివిక్రమ్ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాలు మొదలయ్యాయి.
కచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్.. సంచలనాలు క్రియేట్ చేయడం ఖాయమంటూ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రేపో.. మాపో.. సినిమా షూట్ ప్రారంభమవుతుందని అంత భావించారు. ఇలాంటి క్రమంలో.. సినిమా క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు వైరల్ అవ్వడం అందరికి.. షాక్‌ను కలిగిస్తుంది. వెంకటేష్ ఓ బడా ప్రాజెక్ట్ సెట్ కావడంతో.. ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని టాక్ నడుస్తుండగా.. మరోపక్క కావాలని త్రివిక్రమ్ చేతిలో నుంచి వెంకటేష్ ను మార్చేశారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఇప్పటివరకు దానిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.