మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. బింబిసారా సేమ్ మల్లిడి వశిష్ఠ డైరెక్షన్‌లో రూపొందుతున్న సోషియా ఫాంటసీ డ్రామా విశ్వంభర. ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా స్పెషల్ సాంగ్‌కు మాత్రం.. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చాడు. ఈ క్రమంలోనే కీరవాణిని ఇన్సల్ట్ చేసినట్లుగా.. థంబ్‌నైల్స్ తెగ వైరల్ గా మారాయి. కీరవాణిని కాదని.. స్పెషల్ సాంగ్ కోసం బీమ్స్‌ని తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే.. తాజాగా డైరెక్టర్ వశిష్ట దీనిపై రియాక్ట్ అయ్యాడు. కీరవాణి ఇచ్చిన ట్యూన్ నచ్చకపోవడంతో బీమ్స్‌ను తీసుకున్నామన్నది అవాస్తవమంటూ చెప్పుకొచ్చాడు.
కొన్ని యూట్యూబ్ ఛానల్లు ఆస్కార్ వచ్చిన కీరవాణిని అవమానించారంటూ.. చెత్త థంబ్‌నైల్స్ పెట్టి తమకు తోచింది చెప్పేస్తున్నారు.. విశ్వంభరలో స్పెషల్ సాంగ్కు మ్యూజిక్ అందించాల్సిన సమయంలోనే వీరమల్లు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పనిలో కీరవాణి బిజీ అయ్యారు. అందుకే ఆయన ఈ సాంగ్ ని మరో మ్యూజిక్ డైరెక్టర్‌తో చేయిద్దామని స్వయంగా వివరించారు. అదేంటి సార్ అంటే.. ఇందులో తప్పేముంది.. ఓ పాట ఒకరు రాస్తే, మరో పాట వేరొకరు రాస్తున్నారు కదా. ఇది అంతే అన్నారని.. నా మొదటి సినిమా బింబిసారకి చిరంతన్ భట్‌తో కలిసి ఆయన పని చేశిన విషయాన్ని నాకు గుర్తు చేశారు. ప్రాజెక్ట్ ఆలస్యం కాకూడదన్నది కీరవాణి గారి ఉద్దేశం. ఈ విషయాన్ని చిరంజీవికి కూడా ఆయన వివరించారు.
అలా.. బీమ్స్‌ను స్పెషల్ సాంగ్ కోసం తీసుకున్నాం అంటూ వశిష్ట క్లారిటీ ఇచ్చాడు. ఇక స్పెషల్ సాంగ్‌లో రిక్షావోడు, ముఠామేస్త్రి ఇలాంటి టైప్ మ్యూజిక్ వస్తుందని, ఆట కావాలా.. పాట కావాలా.. ,రగులుతుంది మొగలి పొద లాంటి సాంగ్ అని ఇలా రకరకాలుగా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ సాంగ్స్ ఏవి కాదు.. ఇది ఒక ఫ్రెష్ సాంగ్ అంటూ వివరించాడు. ఈ సాంగ్ లో చిరంజీవితో కలిసి బాలీవుడ్ బ్యూటీ మౌనిరాయ్ స్టెప్పులు వేసింది. ఇక సెప్టెంబర్ 25న విశ్వంభర రిలీజ్ కానుందా అనే ప్రశ్నకు అప్పుడు ఓజి, అఖండ 2 వస్తుంటే.. మా సినిమాని ఎందుకు రిలీజ్ చేయాలి అనుకుంటాం.. అదంతా కేవలం పుకార్లే. పైగా చిరంజీవి గారి సినిమా పండక్కి రావాలని నేను అనుకోను. ఆయన సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే పండగ. విఎఫ్ఎక్స్ అన్ని పూర్తయ్యాకే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం అంటూ వశిష్ఠ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వశిష్ట కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.