ఏపి డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. ఆమె ఏది మాట్లాడినా ఖచ్చితంగా అభిమానులు దాన్ని పవన్ కళ్యాణ్ కు లింక్ చేస్తూ తెగ ట్రెండ్ చేసేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఇతర మతాలను అవమానించడం.. ఇటీవల కాలంలో ఫ్యాషన్ అయిపోయింది అంటూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన హరిహర వీరమల్లు సినిమాకు లింక్ చేస్తూ.. రేణు దేశాయ్.. పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించే ఇలా కామెంట్స్ చేసింది అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు.
ఇక హరిహర వీరమల్లు సినిమాల్లో హిందూ మతానికి సంబంధించిన టాపిక్ హైలెట్గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంతకీ రేణు దేశాయ్ ఆ కామెంట్స్ దేని గురించి చేశారు. అసలు మ్యాటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఇటీవల ఓ ఇస్కాన్ రెస్టారెంట్‌కి ఓ బ్రిటీషర్ వచ్చాడు. అతను వి – లాగర్. తన వద్దకు వచ్చిన వెయిటర్ తో కేఎఫ్‌సి ఉందా అని అడిగాడు. దానికి.. వెయిటర్ క్షమించండి ఇక్కడ అలాంటివి దొరకవు. వెజ్ ఫుడ్ మాత్రమే ఉంటుందని చాలా వినియంగా సమాధానం చెప్పాడు. తర్వాత.. ఆ వి – లాగర్.. తన బ్యాగ్‌లో ఉన్న కేఎఫ్‌సి బాక్స్ తీసుకుని.. అక్కడే తినడం ప్రారంభించేసాడు.
దీంతో అక్కడ వాళ్ళు ఇది పవిత్రమైన చోటు. దయచేసి.. ఇలాంటివి ఇక్కడ తినకండి అంటూ ఎంతగానో బ్రతిమాలారు. అయినా.. అతను వినకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దాన్ని.. చూసిన రేణు దేశాయ్ వీడియో పై రియాక్ట్ అవుతూ.. ఇతర దేశాలను మతాలను వారి నమ్మకాలను అగౌరవించడం ఇటీవల కాలంలో ఫ్యాషన్ అయింది. ఇలాంటి మూర్ఖులను కఠినంగా శిక్షించాలి అంటూ ఫైర్ అంది. ఆమె కామెంట్స్‌కు నెటిజన్లు తమ మద్దతు అందిస్తున్నారు. అయితే.. మరి కొంతమంది పవన్ హేటర్స్ మాత్రం మరి వీరమల్లు సినిమా విషయంలో పవన్‌ను ఉద్దేశించే రేణు దేశాయ్ ఇలా అందంటూ ట్రోల్ చేస్తున్నారు.