రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ నుంచి లేటెస్ట్గా ఆరిపోయే అప్డేట్ రివీల్ చేశారు మేకర్స్. కింగ్డమ్ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను చెబుతునే.. విజయ్ ఏ రోల్లో నటించాడు అనేది క్లారిటీ ఇచ్చారు. ఇక విజయ్ దేవరకొండ ఇటీవల కాలంలో వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కింగ్డమ్ తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. గౌతమ్ తిన్నానూరి డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాకు సీతారా ఎంటర్టైన్మెంట్స్, ఫర్చ్యూన్ సినిమాస్ బ్యానర్లపై సాయి సౌజన్య, సూర్యదేవర నాగావంశి సంయుక్తంగా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఈ నెల 31న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఈనెల 26న ట్రైలర్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇప్పటికే.. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ట్రైలర్‌తో పూనకాలు తెప్పించడానికి సిద్ధమవుతున్నాడు విజయ్. జులై 26న తిరుపతిలో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో టీం ప్లాన్ చేశారు. తిరుపతిలో జరిగే ఈ ఈవెంట్లోనే అన్ని భాషల ట్రైలర్స్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది.
ఇక సినిమా నుంచి ట్రైలర్ అప్డేట్ కోసం తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్లో విజయ్ లుక్ అదరిపోయింది. ఓ మహిళ ఆయనకు వీర తిలకం దిద్దుతున్నట్లుగా ఉన్న పవర్ఫుల్ లుక్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో విజయ పాత్ర సైతం అంతే బలంగా ఉండనుందని సమాచారం. భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. గత సినిమాలు సరిగ్గా సక్సెస్ అందుకోకపోయినా.. ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడతారని టీం ఆనందం వ్యక్తం చేస్తుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ పీరియాడికల్ మూవీలో విజయ్ ఓ స్పైగా కనిపించనున్నాడని సమాచారం. ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. సెంటిమెంట్ సీన్స్ మాత్రం సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయట. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదే రేంజ్ లో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందో.. లేదో.. చూడాలి.