బన్నీ – అట్లీ కాంబోలో ఇండియన్ సినిమా భారీ రికార్డు టార్గెట్..!

ఈ రోజుల్లో వంద, రెండువందల కోట్ల వసూళ్లు సాధారణమైన అంశంగా మారిపోయాయి. సూపర్ స్టార్ సినిమాలకు లక్ష్యంగా మాత్రం నీలి గగనాన్ని చూస్తున్నారు. ఐదు వందల కోట్లు, వెయ్యి కోట్లు అంటూ మాత్రమే హిట్ కొట్టిన ఫీలింగ్ రావడం లేదు. కానీ ఇప్పటి వరకూ ‘దంగ‌ల్‌’ (₹2000 కోట్లు) కలెక్షన్స్‌ను దాటిన భారతీయ సినిమా ఇంకా లేదు. ఆ ఘనత కోసం ‘బాహుబలి 2’, ‘RRR’, ‘పుష్ప 2’ వంటి భారీ సినిమాలు ప్రయత్నించినా, అది సాధ్యపడలేదు. ఇప్పుడు ఆ 2000 కోట్ల క్లబ్‌ని టార్గెట్ చేస్తూ బన్నీ – అట్లీ కాంబో జట్టు కట్టింది.

బన్నీ, అట్లీ సినిమాపై క్రేజీ బజ్- సెకండ్ హీరోగా కోలీవుడ్ స్టార్!అల్లు అర్జున్, అట్లీ కలిసి చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ‘ఐకాన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాకు దాదాపు ₹500 కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఒక్క టార్గెట్ – బన్నీ కెరీర్‌లోనే కాదు, భారతీయ సినిమాల చరిత్రలో కూడా మైలురాయిగా నిలవడం. అంటే ‘పుష్ప 2’ వసూళ్లను దాటి, ‘దంగ‌ల్‌’ ను మించేందుకు అడుగులు వేస్తోంది ఈ సినిమా. అట్లీ, ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ కొట్టిన తర్వాత, బన్నీతో కలిసి చేస్తున్న ప్రాజెక్ట్‌పై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. బన్నీకి ఇప్పటికే ఉత్తర భారతదేశంలో మంచి ఫాలోయింగ్ ఉంది. ‘పుష్ప’ సక్సెస్‌తో గ్లోబల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతర్జాతీయ క్రీడాకారుల దగ్గరి నుంచి హాలీవుడ్ సెలెబ్రిటీల వరకూ పుష్ప స్టెప్స్, డైలాగ్స్ మిమిక్రీ చేసిన ఘటనలు అందరికీ గుర్తుండే ఉన్నాయి.

Allu Arjun Atlee Movie: త్రీ జనరేషన్స్... నాలుగు రోల్స్‌లో బన్నీ - అట్లీ  ప్లానింగ్ మామూలుగా లేదుగా... | Allu Arjun to play four distinct roles three  generations in atlee movie latest buzz gone ...

ఈ క్రేజ్‌ను మరోసారి ఐకాన్ సినిమాతో పునరావృతం చేయాలని బన్నీ, అట్లీ ప్లాన్ చేస్తున్నారు . ఈసారి ప్రమోషన్‌ మీద మరింత దృష్టి పెట్టనున్నారు. దాదాపు ₹100 కోట్ల ప్రోమోషన్ బడ్జెట్ ఉంటుందనే వార్తలున్నాయి. జపాన్, ఇండోనేషియా, మధ్యయుక్త దేశాలు, లాటిన్ అమెరికా లాంటి మార్కెట్లలో కూడా ప్రదర్శనలు, ప్రచారాల ద్వారా ఈ సినిమాను గ్లోబల్ రేంజ్‌లో తీసుకెళ్లాలనే టార్గెట్. ఒకవేళ ఈ ప్రణాళికలు అన్ని సక్సెస్ అయితే, బన్నీ సినిమా 2000 కోట్ల క్లబ్‌లో చేరడం అసాధ్యం కాదు. అట్లీ మాస్ డైరెక్షన్, బన్నీ స్టైల్, డాన్స్, గ్లామర్, యాక్షన్ అన్నీ కలిస్తే.. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్‌బస్టర్‌గా నిలవొచ్చు.