నందమూరి నటసింహం తారక రామారావు నట వారసుడిగా, సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకుని రాణిస్తున్న తారక్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే తన నెక్స్ట్ సినిమాల విషయంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకుంటూ.. అడుగులు వేస్తున్నాడు. ఇప్పటివరకు వరుసగా ఏడు సినిమాలతో సక్సెస్‌లు అందుకున్న తారక్.. ప్రస్తుతం ఎనిమిదో సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఆగస్టు 14న వార్ 2 సినిమాతో తారక్ గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. హృతిక్ రోషన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా బాలీవుడ్ నుంచి సినిమా పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతుంది. తారక్ కెరీర్‌లో ఫస్ట్ బాలీవుడ్ మూవీ కూడా ఇదే కావడం విశేషం.
అయితే.. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొడతాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినీ మేధావులు సైతం ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ క్రమంలోనే సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుంది.. పాన్ ఇండియా లెవెల్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. ఇక నీల్ మూ వీ అంటే భారీ సెట్టింగ్స్, తన మాటలు, యాక్షన్ తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటాడు. మరి అలాంటి నీల్ – మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా అంటే ఏ రేంజ్ లో ఎలివేషన్స్, యాక్షన్స్ ఉంటాయో తెలుసుకోవాలని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
ఇక ప్రస్తుతం సరవేగంగా షూట్ జరుపుకుంటున్న టీం.. క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటివరకు జరిగిన షూట్ అంతా ఒక ఎత్తైతే.. ఆ క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రమే మరో లెవెల్ లో ఉండబోతున్నాయని.. క్లైమాక్స్ సినిమాకు నెక్స్ట్ లెవెల్ హైలెట్గా నిలవనుందని టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో కేవలం యాక్షన్ సీన్స్ లో పాల్గొనడమే కాదు.. ఎక్కువ శాతం డూప్ లేకుండా తానే ఆ సన్నివేశాలు అన్నిటిని పూర్తి చేస్తున్నాడట. కాగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గూస్ బంప్స్ లెవెల్‌లో ప్రశాంత్ మూవీ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. మొత్తానికి వచ్చే నెలలో సినిమా యూనిట్ ఆఫ్రికా వెళ్లి ఫైట్‌ను పూర్తి చేసి రావాలనే ప్లానింగ్ లో ఉన్నారు. దీనికి20 రోజులపాటు క్లైమాక్స్ ఫైట్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. దీనికోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్‌ను రంగంలోకి దించనున్నాడట నీల్. మరి ఈ సినిమాతో తారక్‌కు.. ప్రశాంత్ ఎలాంటి సక్సెస్ ఇస్తాడో వేచి చూడాలి.