ప్రశాంత్ నీల్ – చరణ్ కాంబో మూవీ స్టోరీ లీక్.. !

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్‌గా తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు చరణ్. అప్పటివరకు తాను సినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న ఈ సినిమా తర్వాత ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళింది అనడంలో సందేహం లేదు. ఇలాంటి క్రమంలోనే చివరిగా ఆయన నుంచి గేమ్ ఛేంజ‌ర్ సినిమా రిలీజై డిజాస్టర్‌గా నిలిచింది.దీంతో తన నెక్స్ట్ సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు చరణ్. అలా.. ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది సినిమాతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని కసితో ఉన్నాడు. ఈ క్రమంలోనే చాలా కష్టపడుతున్నాడు చరణ్.

ఇప్పటికే సరవేగంగా షూట్‌ను పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా మార్చ్ 26న‌ గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ అప్పటివరకు బ్యాలెన్స్ చేస్తూ సినిమాపై ఏ మాత్రం హైప్ తగ్గకుండా టీం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత చరణ్ సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయ‌నున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఇంకో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌.. తార‌క్‌తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్‌తో సలార్ 2 లైనప్‌లో ఉండనే ఉంది. రెండు సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ – చరణ్ కాంబోలో సినిమా రానుంది.

1944 బ్యాక్ డ్రాప్ తో సినిమా తెర‌కెక్క‌నుంద‌ని.. స్వతంత్రం రాకముందు మన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.. అప్పటి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది.. అనే ఒక ఆసక్తికరమైన పాయింట్‌తో సినిమాను రూపొందించేందుకు ప్రశాంత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రశాంత్ నీల‌ఖ‌ ఇప్పటివరకు తను తెర‌కెక్కించిన ప్రతి సినిమాలోను ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా భారీ యాక్షన్ హిస్టారికల్ సినిమాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. 80,90 నాటి సినిమాలను చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉండే ఆయన చరణ్‌తో సైతం హిస్టోరికల్ కథను తీయాలని భావిస్తున్నాడట. ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.