లేకుండా శ్రీ లీలకు మాత్రం క్రెస్ కాస్త కూడా తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఓ కొత్త హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది యంగ్ బ్యూటీ. ఆ హీకో ఎవరో రాదు.. ప్రముఖ రాజకీయవేత్త, బిజినెస్ మాన్ గాలి జనార్ధన్ ఏకైక వారసుడు కిరీటి. ఇక తాజాగా కిరీటి జూనియర్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీకి సిద్ధమయ్యాడు. ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీలా తాజాగా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ వైరల్ వయ్యారితో తెగ ట్రెండింగ్‌గా మారింది. ఓ వైపు స్టార్ హీరోలతో కలిసి పనిచేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కొత్త హీరోలతో సైతం నటించేందుకు సై అంటుంది. అయితే.. ఈ సినిమా కోసం అమ్మడు రెమ్యునరేషన్ కూడా గట్టిగానే డిమాండ్ చేసిందని వార్తలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు మూలాలున్న శ్రీలీల చిన్నపట్టినుంచి బెంగళూరులో పెరిగింది. హీరోయిన్గా తొలి సినిమా కన్నడలోనే నటించింది. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత జూనియర్ సినిమాతో మరోసారి కన్నడ ఆడియన్స్‌ను పలకరించనుంది. ఈ సినిమా జూలై 18న కన్నడతో పాటు.. తెలుగులోనూ గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ సినిమా సాంగ్స్.. ప్రమోషన్ కంటెంట్‌తో ఇప్పటికే ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. కాగా.. స్టార్ హీరోల సినిమాలకు ప్రస్తుతం రెండు కోట్ల వరకు చార్జ్ చేస్తున్నా ఈ అమ్మడు.. జూనియర్ కోసం అయితే ఏకంగా నాలుగు కోట్ల రెమ్యూనరేషన్‌ను తీసుకుందట. అంటే.. తన సాధారణ రెమ్యునరేషన్ కంటే డబల్‌గా ఈ సినిమాకు చార్జ్ చేసింది.
ఈ సినిమాలో శ్రీ లీలనే కాస్త టాలీవుడ్ ఆడియన్స్‌కు చెప్పుకోదగ్గ ఫేమ్. కిరీటి కొత్త వాడే. జెనీలియా ఛానాళ తర్వాత మళ్లీ సౌత్ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తుంది. ఇలాంటి క్రమంలో శ్రీలీల సినిమాకు హైలైట్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఈ సినిమా కోసం టాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. డిఎస్పి మ్యూజిక్ అందిస్తుండగా.. రాజమౌళి సినిమాలకు పని చేసే సెంథిల్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించాడు. తమిళ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకుడుగా రూపొందిన ఈ సినిమాను వారాహి ప్రొడక్షన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు.. ఇప్పటికే వచ్చినా ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌లో క్లారిటీ వచ్చేసింది. ఇక సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. శ్రీలీల ఈ సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ కొడుతుందో లేదో చూడాలి.